కల నిజమైన దినం

by Ravi |
కల నిజమైన దినం
X

పోరాటాలగడ్డమీద తొలిపోద్దయి

తెలంగాణ ఉదయించిన దినం.

అమరులత్యాగాల ఫలితమీదినం.

విద్యార్థి నిరుద్యోగ కార్మిక కర్షకులు

సబ్బండవర్గాల విజయదరహాసం ఈ దినం.

తెలంగాణ ప్రజలందరి కల నిజమైనదినం.

ఉద్యమాలపాటనందుకొని

పోరాటాల జెండాను చేతబట్టుకొని

తరతరాల స్వప్నాన్ని నిజం చేసినదినం.

నీళ్లకోసం నిధులకోసం పిడికిలెత్తి నినదించి

లాఠీలను తూటాలను ఎదిరించి..

మిలియన్ మార్చ్... సడక్ బంద్...

సకలజనుల సమ్మెతో.. విద్యార్థి గర్జనలతో..

శాంతియుతయుద్దాన్ని అందుకొని..

ఏండ్లసంది ఎతలను ఎనిక్కినెట్టి

తెలంగాణను సాధించుకున్న దినం.

సగర్వమై తెలంగాణ పరుగులు తీస్తుంది.

నెర్రలిడిన నేలపై గోదావరి జలదారలు.

తెలంగాణ పృథివి చుట్టూ

ఆకుపచ్చని పంటల తోరణాలు.

హాలికుడి నేస్తమైన రైతుబంధు బంధువై

రైతన్న నట్టింటి ధాన్యపురాసుల గలగలలు.

పాలపిట్టలు పిచ్చుకల చప్పుళ్ళు.

ఊరు సెరువులన్నీ నిండుకుండలు.

పల్లె పొలిమేరలన్ని ఆకుపచ్చనివనాలు.

ఆశించి తెచ్చుకున్న తెలంగాణ

అందరికీ అభివృద్ధయి నిలవాలి.

పాలకుల స్వార్థంతో పాలన పడకేయరాదు.

చిహ్నాలు, పాసింగులు మార్చినంత మాత్రాన

పాలన పరుగులు పెట్టదు.

ప్రజలు కలగన్న తెలంగాణ సాకారం కావాలి.

నిరుద్యోగం పేదరికం రూపుమాపాలి.

స్వరాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధి

జెండాను ఎత్తుకొని విశ్వయవనికపై

విజయఢంకా మోగించాలి.

- అశోక్ గోనె

94413 17361

Advertisement

Next Story

Most Viewed