- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రహదారి
X
అప్పుడప్పుడూ
రాలిపడుతున్న నక్షత్రాల్ని
సంచీలో వేసుకుని
నడుస్తున్న ప్రతిసారి
అవి కవిత్వాన్ని చెబుతాయి...
ఎవరికోసమో కాకుండా
నేను నేనుగా బ్రతికిన కాలాన్ని
ఎదురు తిరిగి ప్రశ్నిస్తాయి
కవిత్వం అంటే జీవితం కదా
జీవితాన్ని సృజించినప్పుడల్లా
నన్ను కవిత్వం ప్రశ్నిస్తుంది
మానవుడా! ఎన్ని లోకాలు
తిరిగితే ఏముంది కాని!
నిన్ను మాత్రం ప్రేమిస్తా
ఎందుకంటే
నేను కవిత్వాన్ని కాబట్టి
రాలి పడుతున్న ప్రతి ఆకు నుంచి
కవిత్వం ఉద్భవిస్తుంది
ఇప్పుడేమి నీతోటి దుఃఖాన్నిపంచుకోట్ల
సంతోషాలు పంచుకోట్ల
మనోవేదన నుంచి
కవిత్వం రాస్తున్నా
నేను కవిననుకున్నా
నేను కవికాక పోయినా
మనిషిననుకున్నా
ఇప్పుడైతే సమస్తాన్ని త్యజించి
ఇలాగైనా, ఎలాగైనా నా దారే రహదారి
కొరుప్రోలు హరనాథ్
97035 42598
Advertisement
- Tags
- poem
Next Story