- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళా బిల్లు...!
‘వరకట్న నిషేధ చట్టం‘ అచ్చి
కట్నం రూపుమాపిందా...?
‘గృహహింస చట్టం‘ అచ్చి హింసను తగ్గించిందా..?
‘నిర్భయ చట్టం‘ అచ్చి
‘స్వేచ్ఛ‘ను ప్రసాదించిందా...?
నేతి బీరకాయలో నెయ్యి కోసం వెతికినట్లు...!
‘మహిళా బిల్లు‘తో
చట్టసభలలోమహిళకు రక్షణ సాధ్యమేనా..?
సమాజంలో లేని రక్షణ
చట్టసభలలో దొరుకుతుందా..?
‘ఎన్నికలు ‘ఖరీదైన ప్రహసనం అయినప్పుడు..
‘సగటు మహిళకు‘ చట్టసభలలో స్థానం దక్కేనా...!
‘ఓటరు‘ అవినీతిపరుడైతే
‘పాలకుడు‘ హరిశ్చంద్రుడౌతాడా ..?
ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టనట్లు..
హింసించేవాడు ఇంట్లోనో, బజారులోనో పాగా వేసినప్పుడు..
మణిపూర్‌లో ‘మానం‘ మంట కలిసినప్పుడు..
‘ఉజ్జయిని ‘లో అర్థనగ్నంగా ఆర్తనాదాలు చేసినప్పుడు..
‘ఢిల్లీ దర్బార్ ‘లో కూర్చుని ఏం చేస్తాం..?
సమాజంలో లేని రక్షణ
చట్టసభలలో దొరుకుతుందా...?
డా. మహమ్మద్ హసన్
9908059234
- Tags
- poem