సప్తపదులు

by Ravi |   ( Updated:2023-10-01 18:30:20.0  )
సప్తపదులు
X

పదం అర్ధవంతం

తెలుగు పద్యం ప్రాచీనమే

కాక శక్తిమంతం

కర్తవ్యం

అనుభవైకవేద్యం

తెలుగు భాషకు

ఊపిరి పోసేది కవిత్వం

వాకిళ్లు లోగిళ్లు

పుస్తకాలకు పురుడుపొసే

అక్షర లక్షల ఆనవాళ్లు

వెలిగిపో కదిలిపో

సర్వస్వం అర్పించిన

త్యాగధనుల అడుగుజాడలలో

నడచిపో

ధర్మమని

నియమమని

చిన్నారుల సేవే

నా జీవితానికి అర్థమని

సదుపాయం

సముదాయం

మంచి మాటలే చేస్తాయి

జీవితాన్ని స్వర్గమయం

విలువైనది

ఘనమైనది

నవనందన బృందావన

సుందర భారత దేశమిది

జూపూడి హనుమంతరావు

94918 69683

Advertisement

Next Story

Most Viewed