- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అందాకా ప్రవహించాలె..
ఎవరో ఎక్కడో ఏదో ఆశిస్తూ తపిస్తూ
అర్రులు చాచుతూ అద్దం పగిలే సరికి
హృదయం ముక్కలై ఒక ముద్రలో
ఇమిడి చింతిస్తూ ఉండిపోతారు
ఆలోచిస్తారు అటువైపు ఇటువైపు..
కొన్నిసార్లు ముక్కుసూటితనం
కత్తిరిస్తుంది తోకలు
నిజానికి అదే నిజం సిసలైన వాస్తవం
వారికేమో కొంత కల్పన
కొంత అవాస్తవ లోకం మోజు!
బతుకు చిగురును పట్టున
ఆవిరి చేస్తుంది కదా చేదు గుళిక
అందులో ఇంకెవరన్నా
ఇముడుతారేమో చూసుకోవాలె
అందాకా ప్రవహించాలె తప్పదు
అది లాటరీ లాంటిది
తగిలితే తగులుతుంది..!!
అట్టాంటి సమయం సందర్భం వచ్చేసరికల్లా
వారన్నా దాటేసుంటారు లేక పరిస్థితులన్నా..
ఇదే ఎప్పుడూ సూత్రం అనుకుంటే
ఒక్కోసారి తారుమారవుతుంటాయ్
కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తుంటాయ్
కొందరికే ఎందుకో అలా
కొన్నింటికే ఏమిటో కదా..!!
అప్పుడు ఆ ఎవరో తేరుకొని
ఈ కొందరిలో ఒకరవ్వాలని అవ్వలేక
ఎప్పుడూ తన దురదృష్టాన్నో
విధిరాతనో తలరాతనో తిట్టుకుంటూ
పాక్కుంటూ పోతుంటారు కసిగా...
లోలోపల మాత్రం ఎప్పుడో ఒకప్పుడు
మనకూ రాకపోదా అనుకుంటూ మళ్ళీ..!!!
వగ్గు రఘువీర్
9603245215
- Tags
- poem