- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కలత నిదుర...!
X
ఊహల స్వప్నాన్ని ఊహించుకొని
రాతిరి పడక మీద నిద్రలోకి జారుకున్న
నా ఆలోచనల ఆశల స్వప్నాన్ని
అందుకోవడానికి అడుగులేస్తున్న చోట
కాలంతో ఎదురీగుతున్నాను.
ఈరాతిరి ఏదో నా యదలో
బరువెక్కి పోతున్న ఆలోచనలు
చల్లగాలికి నిద్రలో ఉలిక్కి పడి లేచాను
కలత నిదురలో కన్న కలల కలన్ని
సాకారం కోసం పరితపిస్తున్నాను.
చీకట్లను చీల్చుకుంటూ ప్రసరిస్తున్న
వెన్నెల కాంతుల వెలుగుల్లో
మసక బారిన నా కండ్లకు
చష్మాలే (అద్దాల) తోడుగా చూస్తే
గడియారం గంటల ముల్లు
అర్ధరాత్రి రెండు కొడుతుంది
నా ఆశలు, ఆలోచనల దాటిని
ఏ దుమారాపు సుడిగాలి
క్షణకాలాన చెరిపేసిన దృశ్యమానమో గానీ
రెక్కలు తెగిన పక్షినైనాను.
కలత నిదురల కలతల్ని
పొద్దు పొడుపుతో తుడిచేస్తూ
కొత్త పుంతలతో అడుగులు వేస్తూ
ఈ ఆశల స్వప్నాన్ని సాకారం చేస్తాను.
వంగల సంతోష్
ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక
Advertisement
- Tags
- poem
Next Story