- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాలుక
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు
కర్మేంద్రియాణాం నాలుక ప్రధానం అంటారు అందరూ
చరిత్ర పుటలలోని ప్రతీ అధ్యాయానికి సజీవ సాక్ష్యం
గెలుపోటములలో ప్రతీ అంకానికి ప్రత్యక్ష గవాక్షం
ఒక నిశ్శబ్ద విప్లవం నాలుక
ఒక మౌన శబ్దం నాలుక
ఒక పదునెక్కిన ఆయుధం నాలుక
ఒక కదం తొక్కిన జనపథం నాలుక
నరం లేని నాలుక బంధాలను విడదీస్తుంది
ఎముక లేని నాలుక అనుబంధాలను పెనవేస్తుంది
అనేక రకాలుగా రక్తపాతం సృష్టిస్తోంది
వివిధ రూపాలలో హిమపాతం కురిపిస్తుంది
ఒక మాటకు ఆధారం నాలుక
ఒక బాటకు ద్వారం నాలుక
ఒక పూదండలో దారం నాలుక
ఒక మకరంద భరిత మందారం నాలుక
ఈటెల మాటలతో గుండెకు గాయం చేస్తుంది
మాటల తూటాలతో మనసును కాల్చేస్తుంది
తీయటి మాటలతో సేద తీరుస్తుంది
మాటల మంత్రాలతో తంత్రాలు నడుపుతుంది
మనిషికి దేవుడు ఇచ్చిన వరం నాలుక
మనిషిని మనిషి పెట్టే కలవరం నాలుక
సరిగా వినియోగించుకుంటే తలమానికం
లేకుంటే మన మనుగడకే అవమానికం
తప్పు చేసి తప్పించుకుంటుంది
ఒప్పుచేసి ఒప్పించుకుంటుంది
అన్ని రుచులూ తనకే అంటుంది
అన్ని దిక్కులూ తనవేనంటుంది
విద్యార్థులకు పెద్దబాలశిక్ష నాలుక
ఉపాధ్యాయులకు ఒక మంచి ఉపకరణం నాలుక
పరవస్తు చిన్నయసూరి బాల వ్యాకరణం నాలుక
వర్ణాలతో సంబంధంలేని వర్ణమాల నాలుక
దీనికి గమ్యస్థానం ఉండదు గమనం తప్ప
దీనికి నియమం ఉండదు సంయమనం తప్ప
దీనికి ఆంక్షలు ఉండవు కాంక్షలు తప్ప
దీనికి బాధ్యతలు ఉండవు హక్కులు తప్ప
అందుకే అంటాను
ఒక అప్రకటిత యుద్ధం నాలుక
ఒక స్వీయ నిర్మిత అద్దం నాలుక
ఒక నిత్యాగ్ని హోత్రం నాలుక
ఒక బీజాక్షరీ మంత్రం నాలుక
జై హింద్!!
సయ్యద్ ఖాసీం అలీ
90590 22889
- Tags
- poem