- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
దారుణం…మద్యం తాగించి అత్త పై లైంగిక దాడి చేసిన అల్లుడు
దిశ, బడంగ్ పేట్ : ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న అత్త పై అల్లుడు దాడి చేసి బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలాపూర్ ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం ... మహమూద్నగర్ కొత్తపేట్ ప్రాంతానికి చెందిన షాకీర్ (34) కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొంత కాలం క్రితం షాకీర్ మామ చనిపోవడంతో అప్పటి నుంచి అత్త వాళ్ల ఇంట్లోనే ఉంటుంది. ఈ నెల 4వ తేదీన ఉదయం షాకీర్ భార్య, అతని పిల్లలు బయటికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో అత్త ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని చూసి ఆమెపై షాకీర్ కన్నేశాడు. అత్తపై దాడి చేసి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు ఈ నెల 6వ తేదీన బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లుడు షాకీర్ పై బాలాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.