Bhatti Vikramarka: సివిల్స్ మెయిన్స్ ఎంపికైతే రూ.లక్ష సాయం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-07 14:31:45.0  )
Bhatti Vikramarka: సివిల్స్ మెయిన్స్ ఎంపికైతే రూ.లక్ష సాయం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: సివిల్స్ మెయిన్స్(Civils Mains) పరీక్షకు ఎంపికైతే రూ.లక్ష సాయం అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Dy.CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. హైదరాబాద్(HYD) అశోక్ నగర్(Ashok Nagar)లో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఈ రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే ఉద్యోగాల సాధన కోసమని, ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని తరహాలో ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్(Job Calendar) విడుదల చేస్తున్నామని చెప్పారు . ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామో ముందే తెలియజేస్తున్నామని, ఆ పనిలో భాగంగా ఇప్పటికే గ్రూప్ -1 పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని, గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించబోతున్నామని వెల్లడించారు.

ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇతర ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో విజయవంతంగా ఉద్యోగాల భర్తీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మేధస్సు ఉన్నప్పటికీ నిరుపేదలు, మధ్య తరగతి వర్గాల వారు ఆర్థిక ఇబ్బందులతో యూపీఎస్సీ పరీక్షలను సాధించడంలో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారిని ఆర్థికంగా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మన రాష్ట్రం నుంచి మెయిన్స్ కు ఎంపికైన వారికి ఇంధన శాఖ పక్షాన ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంగా అందించినట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మెటీరియల్, ప్రత్యేక శిక్షణ వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు వివరించారు. సివిల్ సర్వీస్ కు మన రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఎంపిక అయితే మన ప్రాంతానికి ప్రయోజనం చేకూరుతుందని, పాలనలో మనవాళ్లు ఎంత ఎక్కువ మంది ఉంటే ప్రాంతీయ అభిమానంతో సంక్షేమ పథకాలు, బడ్జెట్ రూపకల్పన, ఇతర అంశాల ద్వారా మన రాష్ట్రానికి అంత ఎక్కువ లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed