- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కూరగాయల కోసం వచ్చి ప్రాజెక్టులో దూకి వ్యక్తి మృతి

దిశ, పరిగి : కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్దామని వచ్చి ప్రాజెక్టులో దూకి దుర్మరణం చెందాడు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం మోమిన్ కాలనీకి చెందిన ఫయాజ్ తన స్నేహితుడు రాజేందర్ రెడ్డి తో కలిసి గురువారం పరిగికి కూరగాయలు కొనేందుకు వచ్చారు. కూరగాయలు కొని తిరుగు ప్రయాణంలో లక్నాపూర్ ప్రాజెక్టులో ఈత కొట్టేందుకు ఆగారు. లక్మాపూర్ ప్రాజెక్టులో ఈత కొట్టేందుకు డైప్ కొట్టాడు. ప్రాజెక్టులో ఉన్న మెట్లకు ఫయాజ్ తల, ముఖ భాగం తగిలింది. దీంతో ఫయాజ్ తీవ్ర గాయాలై నీటిలోని మునిగిపోయాడు. ఇది గమనించిన రాజేందర్ రెడ్డి లక్మాపూర్ గ్రామస్తులకు చెరువులో దూకి తన స్నేహితుడు ఫయాజ్ మునిగినట్లు తెలిపాడు. లక్నాపూర్ గ్రామస్తులు పరిగి పోలీసులు సమాచారం అందించారు. రాత్రి కావడంతో శుక్రవారం ఉదయం వచ్చి ప్రాజెక్టు వద్ద వెతికారు ఫయాజ్ మృతదేహం ప్రాజెక్టులో తేలి ఉంది. ఫయాజ్ మృతదేహాన్ని బయటకు తీసి పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.