Balakrishna: నాన్న ఇన్‌స్పిరేషన్‌తోనే ఆ సినిమా చేశాను.. నందమూరి నట సింహం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2025-03-31 15:53:16.0  )
Balakrishna: నాన్న ఇన్‌స్పిరేషన్‌తోనే ఆ సినిమా చేశాను.. నందమూరి నట సింహం ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన ‘ఆదిత్య 369’ (Aditya 369) మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 4వ తేదీన రీ-రిలీజ్ (Re-release) అవుతోంది. భారతదేశ సినిమా చరిత్రలోనే టైమ్ ట్రావెల్ (Time travel) అనే పాయింట్ మీద రూపొందిన మొట్టమొదటి సినిమా ‘ఆదిత్య 369’. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (S.P. Balasubrahmanyam) సమర్పణలో, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో కృష్ణకుమార్ అనే యువకుడిగా, శ్రీకృష్ణదేవరాయలుగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాను, 34 సంవత్సరాల తర్వాత 4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో మరింత అధునాతనంగా మళ్ళీ ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తాజాగా హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘సినిమా సినిమాకి వేరియేషన్స్ కోసం ప్రయత్నిస్తున్న సమయం అది. చలనచిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసింది, విశ్వానికే నటన ఎలా ఉంటుందో చూపించింది నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడైన నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) గారు. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. గ్లామర్ పాత్రలు చేసే సమయంలోనే ‘రాజు-పేద’ సినిమాలో డీ గ్లామర్ పాత్ర చేశారు. ఆయన స్ఫూర్తితో నేను భైరవద్వీపంలో చాలా డీగ్లామర్ పాత్రని చేశాను. ‘ఆదిత్య 369’ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర ధరించడానికి నాన్నగారే ఇన్‌స్పిరేషన్ (Inspiration). కొత్త కాన్సెప్ట్‌‌తో సింగీతం, కృష్ణప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం నా దగ్గరకి వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. మంచి సినిమా అవుతుందన్న నమ్మకంతో ప్రోత్సహించాను. ఈ సినిమాలో నేను ధరించిన రెండు పాత్రల్లో చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఆయా పాత్రల ఆత్మలోకి ప్రవేశించినప్పుడే అది కనిపిస్తుంది.

Next Story

Most Viewed