- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తమ్ముడి ప్రేమకు సహకరించాడని.. అన్నని ఎలా కొట్టారో చూడండి!

దిశ, దేవరకద్ర: ప్రేమ విషయంలో తమ్ముడికి సహకరించాడని నెపంతో యువతి తరపు బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన సంఘటన శుక్రవారం పెద్ద రాజమూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పెద్దరాజమూర్ కు చెందిన అరుణ్ కుమార్ కు రెండు సంవత్సరాల క్రితం మణికొండ కు చెందిన ఒక అమ్మాయితో వివాహం జరిగింది. అనంతరం అనారోగ్య కారణాలతో ఏడాది క్రితం అమ్మాయి చనిపోయింది. దీంతో 5 నెలల క్రితం గురకొండకు చెందిన మరో అమ్మాయితో ప్రేమాయణం నడుపుతూ ఇంటికి తీసుకొచ్చాడు. అతడి వేధింపులు తాళలేక తిరిగి వెళ్ళిపోయింది. ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం గ్రామంలో అదే సామాజిక వర్గానికి చెందిన మరొక అమ్మాయిని ప్రేమ పేరుతో తీసుకెళ్లాడు. యువతి తల్లిదండ్రులు వారిని వెతికి పది రోజుల క్రితం గ్రామానికి తీసుకువచ్చి పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు.
యువకుడికి అంతకుముందే వివాహం జరగడంతో యువతి తరపు వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో చేసిన తప్పుకు యువతి కుటుంబానికి జరిమానా చెల్లించాలని యువకుడి కుటుంబానికి పెద్దలు సూచించారు. అయినాప్పటికీ మార్పు కనిపించకపోవడంతో శుక్రవారం యువతి కుటుంబానికి చెందిన బాబాయి మాధవులు, తండ్రి మైబు, తాత ఆంజనేయులు ముగ్గురు కలిసి కత్తులతో యువకుడు ఇంటి పైకి దాడికి వెళ్లారు. అక్కడ యువకుడి అన్న రవికుమార్ ఒక్కడే ఉండడంతో జరిగిన సంఘటనలో నీ పాత్ర కూడా ఉందని ఆరోపిస్తూ.. కత్తులతో అతడిపై దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితుని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా సిఐ రామకృష్ణ, ఎస్ఐ నాగన్నలు పెద్దరాజామూర్ గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ విషయంలో బాధితుడి భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.