- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Tirupati: రోజాను వదిలిపెట్టని కిరణ్.. పక్కా ఆధారాలతో సీఐడీ విచారణకు డిమాండ్
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి రోజా(Former minister Roja)ను తిరుపతి జనసేన కిరణ్ రాయల్(Tirupati Janasena Kiran Royal) విడిచిపెట్టడంలేదు. గతంలో ఆమె నిర్వహించిన శాఖలో జరిగిన అవినీతి ఆయన వెలికితీశారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సైతం ఉన్నాయని చెబుతున్నారు. ఏపీ టూరిజం శాఖ(AP Tourism Department) మంత్రిగా పని చేసిన సమయంలో రోజా భారీ అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ఈ స్కామ్‌లో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డితో పాటు మల్లారెడ్డి, పలువురు ప్రమేయం ఉందని ఆరోపించారు. టూరిజం శాఖలో రూ. 400 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. తిరుమల శ్రీవారి పేరు చెప్పి టూరిజం శాఖలో ప్రతి రోజు రూ. లక్ష కొట్టేశారని పేర్కొన్నారు. స్కామ్‌పై ఇప్పటికే మంత్రి కందుల దుర్గేశ్(Minister Kandula Durgesh) దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మొత్తం ఆధారాలతో సీఐడీకి ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు. టూరిజం శాఖలో జరిగిన అవినీతి బాగోతంపై విచారణకు డిమాండ్ చేస్తున్నామని కిరణ్ రాయల్ పేర్కొన్నారు.