- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Elon Musk: ఎలన్ మస్క్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్
దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో స్పేస్ఎక్స్ సీఈఓ, ఎక్స్ బాస్ ఎలన్ మస్క్‌ను ప్రశంసలతో నింపేశారు. మస్క్‌ను అద్భుతమైన వ్యక్తి అని, సూపర్ మేధావి అంటూ అభివర్ణించిన ట్రంప్.. స్పేస్ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్ గురించి ప్రస్తావించారు. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో కీలక ప్రాంతాలను తాకిన హెలెన్ తుఫాను సమయంలో స్టార్‌లింక్ ఎంతోమంది ప్రాణాలను ఎలా రక్షించిందో ట్రంప్ చెప్పారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కొన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తున్న స్టార్‌లింక్‌కు ఇది సానుకూల పరిణామం. భారత్‌తో ట్రంప్‌కు ఉన్న అనుబంధం ద్వారా స్టార్‌లింక్ మన మార్కెట్లో ఎదుర్కొంటున్న సవాళ్లను సులభంగా అధిగమించవచ్చనే అంచనాలు పెరిగాయి. 2021 నుంచి స్టార్‌లింక్ తన సేవలను భారత మార్కెట్లో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, మన దేశ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ సమస్య ఉండటంతో ఇది ఆలస్యమవుతోంది. శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయించే అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుండటం, ట్రంప్ పాలన మస్క్‌కు బ్యాకప్‌గా ఉండే అవకాశం ఉన్నందున స్టార్‌లింక్ మన మార్కెట్లో అడుగు పెట్టేందుకు ఎంతమాత్రం ఆలస్యం కాకపోవచ్చు. ప్రభుత్వం స్టార్‌లింక్ ఆశించే విధంగా భారత మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్ అందించే చర్యలను సులభతరం చేస్తే, ఇది దేశీయంగా ఉన్న ముఖేష్ అంబానీ జియో, సునీల్ మిట్టల్ ఎయిర్‌టెల్‌లతో పోటీని ఎదుర్కోనుంది.