ప్రభుత్వ పాఠశాలలకు నాసిరకం బియ్యం సరఫరా.. అధికారులపై చర్యలేవీ..?

by Aamani |
ప్రభుత్వ పాఠశాలలకు నాసిరకం బియ్యం సరఫరా.. అధికారులపై చర్యలేవీ..?
X

దిశ,గద్వాల్ : ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే బియ్యం పై సివిల్ సప్లై గోదాం లలో అధికారుల పర్యవేక్షణ కరువయ్యింది. అక్కడ ఉద్యోగం చేస్తున్న క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటూ ఉపాధ్యాయ సంఘాలు మండి పడుతున్నాయి. బియ్యం క్వాలిటీ చెక్ చేయకుండా అవి పాఠశాలల్లోని పిల్లలు తినడానికి పనికి వస్తాయో లేదో చూడకుండా సివిల్ సప్లై అధికారులు బియ్యం పంపిణీ చేస్తున్నారని కొన్ని సార్లు పురుగులు పడిన బియ్యం వస్తున్నాయని అన్నం వండితే గడ్డ కడుతుందని మధ్యాహ్న భోజనం చేసే మహిళలు ఉపాధ్యాయులను అంటున్నారని, ఏదైనా జరగరానిది పాఠశాలలో జరిగితే ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేయడం సరికాదు అంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

మధ్యాహ్న భోజన పథకం బాధ్యతలు వేరేవారికైన ఇస్తే బాగుంటుందని ఉపాద్యాయులు దిశ దినపత్రికకు తెలియజేశారు.పాఠశాలలో క్లాసులు చెప్పాలా లేక మధ్యాహ్న భోజనం ఎలా ఉందో చూసుకోవాలా నాసిరకం బియ్యం ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్న సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం మాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు..

మేము ఇంట్లో వండుకుని తింటాం.. కానీ బియ్యం ఇలాంటివి కాదు : వంట ఏజెన్సీలు

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే వంట ఏజెన్సీలు సైతం బియ్యం సరఫరా పై మండి పడుతున్నారు. పాఠశాలకు వచ్చే బియ్యం నాసిరకం బియ్యం వస్తున్నాయని ఒక్కోసారి పురుగులు ఉన్న బియ్యం వస్తున్నాయని అయినా ఆ బియ్యాన్ని క్లీన్ చేసి వండినా గడ్డ కడుతుందని అలాంటి ఆహారం విద్యార్థులు తింటే ఏమైనా జరిగే అవకాశం ఉంటుందని వాపోతున్నారు. ఒక్కోసారి బాధ్యులం మేము కాకపోయినా పిల్లల తల్లిదండ్రులతో ,పాఠశాల ఉపాధ్యాయులతో తిట్లు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి వంట ఏజెన్సీలు.

Advertisement

Next Story

Most Viewed