Indian Navy Submarine: గోవాలో నేవీ మెరైన్ ను ఢీకొన్న ఫిషింగ్ బోట్.. ఇద్దరు గల్లంతు

by Shamantha N |
Indian Navy Submarine: గోవాలో నేవీ మెరైన్ ను ఢీకొన్న ఫిషింగ్ బోట్.. ఇద్దరు గల్లంతు
X

దిశ, నేషనల్ బ్యూరో: గోవాలో భారత ఫిషింగ్ బోట్, భారత నేవీ మెరైన్(Indian Navy Submarine) ను ఢీకొని ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం గోవాకు వాయువ్యంగా 70 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. పడవలో 13 మంది సభ్యులు ఉండగా, అందులో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం తర్వాత, భారత నావికాదళం వెంటనే పెద్ద ఎత్తున సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కోసం భారత నావికాదళం ఆరు నౌకలు, విమానాలను మోహరించింది.

రెస్క్యూ ఆపరేషన్

ముంబైకి చెందిన మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (MRCC) సహకారంతో రెస్క్యూ ఆపరేషన్‌ను నేవీ ముమ్మరం చేసింది. నేవీ వెంటనే సమీపంలోని ఓడలు, విమానాలను అక్కడికి పంపింది. దీంతో, నీటిలో మునిగిపోయిన వారిని వీలైనంత త్వరగా ఒడ్డుకు చేర్చారు. గోవా, ముంబై తీర ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీలు కూడా రెస్క్యూలో నిమగ్నమై ఉన్నాయి. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపడతామని అధికారులు తెలిపారు. గల్లంతైన సభ్యులను సురక్షితంగా రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని నేవీ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story