Future City : పోలీసు బందోబస్తు నడుమ ఫ్యూచర్ సిటీ సర్వే..రైతుల నిరసన

by Y. Venkata Narasimha Reddy |
Future City : పోలీసు బందోబస్తు నడుమ ఫ్యూచర్ సిటీ సర్వే..రైతుల నిరసన
X

దిశ, వెబ్ డెస్క్ : ఫార్మా కంపెనీకి మా భూములు ఇవ్వం అంటూ లగచర్ల రైతులు చేసిన లడాయి మరువకముందే ఫ్యూచర్ సిటీ(Future City) రైతులు సైతం భూసేకరణ ప్రయత్నాలపై తిరుగుబాటు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పేరిట భూసేకరణ సర్వేకు వెళ్లిన అధికారులను కందుకూరు, కొంగరకలాన్ రైతులు అడ్డుకోవడం(Farmers protest)కలకలం రేపింది. సర్వే అధికారులను రైతులు అడ్డుకోగా పోలీస్ బందోబస్తు మధ్య సర్వే కొనసాగించారు. ఈ క్రమంలో ఓ రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నంతో నిరసన తెలిపాడు. ప్రాణం పోయినా ఫ్యూచర్ సిటీకి మా భూములు ఇవ్వం అంటూ రైతులు సర్వే అధికారులకు అడ్డుపడ్డారు.

హైదరాబాద్ నగర శివార్లలో నిర్మించాలని తలపెట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసింది. దీనికి అదనంగా 16 వేల ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సర్కారు నిర్ణయించింది.. అంటే మొత్తం 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనుంది. అయితే భూ సర్వేను అడ్డుకున్న రైతుల ఆవేశం చూస్తే అదంతా సులభంగా సాగే ప్రక్రియ కాదంటున్నారు స్థానికులు.

Advertisement

Next Story