Caste census survey : తార్నాకలో రోడ్లపై కులగణన సర్వే దరఖాస్తులు! వీడియో వైరల్

by Ramesh N |   ( Updated:2024-11-23 12:58:40.0  )
Caste census survey : తార్నాకలో రోడ్లపై కులగణన సర్వే దరఖాస్తులు! వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ (Congress Govt) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ వీడియో నెట్టింట్ తాజాగా వైరల్‌గా మారింది. (Hyderabad) హైదరాబాద్‌లోని తార్నాకలో తార్నాకలో (Caste census survey) కుల గణన సర్వే దరఖాస్తులు కొన్ని రోడ్లపై చిత్తుకాగితాల మాదిరి పడి ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.

కాగా, ఇటీవల కూడా మేడ్చల్ పరిధిలోని రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారి పొడవునా గురువారం సాయంత్రం సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దర్శనమిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్లపై కన్పించడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ప్రజా పాలన అప్లికేషన్లు రోడ్లపాలు చేశారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని ఇలా రోడ్లపై వేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed