డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ మూవీ నుంచి హీరో ఫస్ట్ లుక్ రిలీజ్

by Hamsa |
డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ మూవీ నుంచి హీరో ఫస్ట్ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా: శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో పూర్వాజ్ (Purvaj)ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రజెంట్ ఆయన ‘కిల్లర్’(Killer) అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో పూర్వాజ్(Purvaj) కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి(Padmanabha Reddy) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి హీరోయిన్ జ్యోతిరాయ్(Jyothi Roy) లుక్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుుంది. తాజాగా, ‘కిల్లర్’ పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. చేతిలో రివాల్వర్ తో పూర్వాజ్ కనిపిస్తున్నారు. ప్రజెంట్ ఈ పోస్టర్ సినీ ప్రియుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Advertisement

Next Story

Most Viewed