Animal: యానిమల్ చిత్రంపై బాలీవుడ్ సీనియర్ నటుడు కీలక వ్యాఖ్యలు..!

by Anjali |   ( Updated:2024-11-22 14:58:21.0  )
Animal: యానిమల్ చిత్రంపై బాలీవుడ్ సీనియర్ నటుడు కీలక వ్యాఖ్యలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) అండ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన యానిమల్(Animal) చిత్రం ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇకపోతే తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు నానాపటేకర్(Nana Patekar) ఈ మూవీ గురించి మాట్లాడారు. ఈ నటుడి తదుపరి సినిమా ‘వనవాస్’(Vanavas) ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అనిల్ కపూర్(Anil Kapoor) హోస్ట్‌గా వ్యవహరించిన ఈ ఇంటర్వ్యూలో నానా పటేకర్ ను సినిమా విశేషాలను అడిగి తెలుసుకు‌న్నారు.

మాటలో మాట యానిమల్ చిత్రం గురించి రాగా.. ఆ మూవీ గురించి మాట్లాడారు. అప్పుడు వెంటనే స్పందించిన నానా పటేకర్.. ‘ వాస్తవానికి అయితే తను యానిమల్ చిత్రం చూడాలనే ఉద్దేశమే లేదని పేర్కొన్నారు. ఫ్రెండ్స్ ఫోర్స్ వల్ల చూడాల్సి వచ్చిందని తెలిపాడు. ఇక మూవీ వీక్షించిన వెంటనే మీకే కాల్ చేసి అనిల్ మాల్ చూశానని చెప్పాను గుర్తుందా? అంటూ అనిల్ కపూర్ తో అన్నాడు. ఎందుకంటే.. అందులో మీ యాక్టింగ్ సమయానుకూలంగా అనిపించిందని వెల్లడించాడు. మిగిలిన నటులంతా కొంచెం అతి చేశారని అనిపించిందని నానా పటేకర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నటుడు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story