ఆ బాధ్యత నిర్వర్తించడం చాలా కష్టం.. నాకు అది పెద్ద సవాలుగా అనిపిస్తుంది.. ప్రభాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2025-03-21 09:26:22.0  )
ఆ బాధ్యత నిర్వర్తించడం చాలా కష్టం.. నాకు అది పెద్ద సవాలుగా అనిపిస్తుంది..  ప్రభాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె(Deepika Padukone) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898AD) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దిశా పటానీ(Disha Patani), కీర్తి సురేష్(Keerthi Suresh) వంటి స్టార్స్ యాక్ట్ చేశారు.

అయితే గత ఏడాది జూన్ 27న రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా కలెక్షన్ల విషయంలోనూ ఎన్నో రికార్డులు తిరగరాసింది. ఇక దీపిక పదుకొణె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే స్టార్ హీరో రణవీర్ సింగ్‌(Ranveer Singh)తో ప్రేమలో పడింది. అలా అతనితో కొన్నేళ్లు డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంది. ఇక రీసెంట్‌గా ఈ జంటకు ఒక పాప పుట్టింది.

అయితే ఇంకా ఈ చిన్నారి ఫేస్‌ని మాత్రం రివీల్ చేయలేదు. ఈ క్రమంలో ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక మాట్లాడుతూ.. ‘ఒక తల్లిగా చిత్రీకరణలో పాల్గొనడం అనేది సవాలే. ప్రస్తుతం నేను నా జీవితంలో మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇక పై షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవ్వాలి. నా కుమార్తెకు తల్లిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తునే సినిమా షూటింగ్‌లో పాల్గొనాలి.

ఇది నాకు అతి పెద్ద సవాలుగా అనిపిస్తుంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తున్నాను. కానీ కచ్చితంగా దీన్ని ఎదుర్కొంటానని నాకు నమ్మకం ఉంది. మాతృత్వం అనేది గొప్ప అనుభూతి. దీని కారణంగా ఎంచుకునే సినిమాలపై ప్రభావం పడుతుంది అని నాకు తెలుసు. కానీ, నేను తల్లి కాకముందు సినిమాల ఎంపికలో ఎలా అయితే జాగ్రత్తలు తీసుకున్నానో, ఇకపై కూడా అలాగే తీసుకుంటాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీపిక పదుకొణె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed