సినీ నటుడు రాజశేఖర్ ఇంట్లో షాకింగ్ ఇన్సిడెంట్.. పెళ్లి చేసుకుని రూ.15 లక్షలతో పరార్

by Gantepaka Srikanth |
సినీ నటుడు రాజశేఖర్ ఇంట్లో షాకింగ్ ఇన్సిడెంట్.. పెళ్లి చేసుకుని రూ.15 లక్షలతో పరార్
X

దిశ, విశాఖపట్నం: విశాఖ(Vizag)లోని వేపగుంట ప్రాంతానికి చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లోని సినీ నటులు జీవిత, రాజశేఖర్(Rajasekhar) ఇంట్లో పని చేస్తోంది. కొత్తవలస మండలంలోని సూరివలస ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి కూడా అక్కడ చేరి కొన్నాళ్లపాటు కారు డ్రైవర్‌గా పనిచేశారు. అప్పటికే ఆ మహిళకు పెళ్లయి భర్తతో విభేదాలు రావడంతో వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో సదరు మహిళను డ్రైవర్ మభ్యపెట్టాడు. ప్రేమిస్తున్నట్లు నటించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.

అతడితో చనువు పెరగడంతో ఆమె తన బంగారాన్ని సైతం అమ్మేసి సదరు వ్యక్తికి ఇచ్చింది. ఖరీదైన ఫోన్ కొనుక్కుంటానంటే డబ్బులిచ్చింది. ఆమెను పెళ్లి చేసుకుని, రూ.15 లక్షల వరకు ఆమె నుంచి తీసుకుని ఆపై పరారయ్యాడు. దీంతో ఆమె తనకు జరిగిన మోసాన్ని జీవిత, రాజశేఖర్‌కు వివరించగా, ఆమెతో పెందుర్తి పోలీసులకు వారు ఫిర్యాదు చేయించారు. పెళ్లి పేరిట నమ్మించి, భారీగా డబ్బు కాజేసి తమ ఇంట్లో మనిషికి మోసం చేసిన ఆ వ్యక్తిని శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story