- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
జారుడు బల్ల
X
అడవిని కొంచెం
తుంచుకొని తెచ్చుకొని
పట్టణంలో నెలకొల్పుకున్న
ఊపిరి తీసుకునే ఉద్యాన వనమన్నా
అందులోని ఉయ్యాలలు 'సీ-సా'లు
జారుడుబల్లలు మహా చచ్చేంత ఇష్టాలు
బాల్యం గుండెల మీద చెదిరిపోని ముద్ర
రాను రాను తొండ ముదిరి
ఊసరవెల్లి అయినట్టు
వయసు పెరిగి పైకి వచ్చిన
నిచ్చెనలను మెట్లను తన్నేసి
రాజకీయ నాయకునిగా
పదకొండవ అవతారం
కలలు పల్లకిపై ఊరేగించి
ప్రజలను ఐరిని బైరిని చేయడం
తరతరాలకు
అడ్డదిడ్డంగా నైనా
సక్రమమో అక్రమమో
నానా గడ్డి కరచి
కూడ పెట్టుకునే సంపద
ఇటీవల మంత్రిగా తంత్రవిద్య నేర్చిన
ఉద్యానవనం ప్రారంభోత్సవానికి వచ్చిండు
యువ మంత్రి క్లిక్ అనే ఫోటోలు మధ్య
ఖాయిష్ పడి జారుడుబల్ల మీంచి
ముసిముసిగా జారాడు
ఇక మొదలైంది చూడు
ఇప్పుడు కాలు వెనక్కితీసుకోరాకుండా
జారుడే దిగజారుడు
జూకంటి జగన్నాథం
94410 78095
Advertisement
- Tags
- poem
Next Story