అల్లు అర్జున్ భార్య నెలకు మూడు సార్లు అయినా అక్కడికి వెళ్లేది అందుకేనా..? ఎట్టకేలకు బయటపడ్డ సంచలన నిజం..!

by Kavitha |   ( Updated:2024-11-09 02:15:11.0  )
అల్లు అర్జున్ భార్య నెలకు మూడు సార్లు అయినా అక్కడికి వెళ్లేది అందుకేనా..? ఎట్టకేలకు బయటపడ్డ సంచలన నిజం..!
X

దిశ, సినిమా: స్టార్ కపుల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహారెడ్డిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బన్నీ ఈ భామను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి అర్హ, అయాన్ అనే ఒక పాప, బాబు ఉన్నారు. అల్లు స్నేహారెడ్డి నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. వెకేషన్స్‌కి వెళ్లినా, సెలబ్రేషన్స్ చేసుకున్నా వాటి పిక్స్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

సాధారణంగా చాలామంది ఎంతో మహిమ గల తిరుమల దేవస్థానానికి వెళ్తుంటారు. కొంతమంది కోరిక నెరవేరినందుకు గానూ వెళితే.. మరికొందరు కోరిక నెరవేరాలని వెళ్తుంటారు. అయితే కామన్‌గా నెలకొక సారి లేదా సంవత్సరానికి ఒక సారి తిరుపతికి వెళ్తారు. కానీ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి మాత్రం కచ్చితంగా నెలకు మూడు సార్లయినా శ్రీవారి దర్శనానికి వెళ్తుందట. అలా రీసెంట్‌గా కూడా వెళ్లిన విషయం సంగతి తెలిసిందే. అయితే ఈమె ఇలా వెళ్లడానికి ఓ రీజన్ ఉందట. అదేంటంటే..? ఈ అమ్మడు కచ్చితంగా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుంది అన్న మూమెంట్లో లేదా తనకు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు అన్న సిచువేషన్‌లో కచ్చితంగా శ్రీవారి దర్శనానికి వెళుతుందట. ఎందుకంటే అక్కడికి వెళితే తన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయని ఆమె నమ్మకమట.

అయితే ఎన్నికల సమయంలో బన్నీ ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నాడో తెలిసిందే. తాజాగా వాటి నుంచి బయటపడ్డాడు అల్లు అర్జున్. ఆ కారణంగానే స్నేహ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు గతంలో 'పుష్ప' సినిమా రిలీజ్ మూమెంట్లో కూడా శ్రీవారి దర్శనానికి నడక మార్గం గుండా వెళ్ళింది స్నేహ రెడ్డి. ఇలా ఈమె శ్రీవారి దర్శనం చేసుకుంటే తనకి మంచి కలుగుతుంది అన్న నమ్మకాన్ని ఎక్కువగా బిలీవ్ చేస్తుంది. మొత్తానికి బన్నీ సక్సెస్‌లో తన భార్య స్నేహ రెడ్డిది కూడా చాలా కీలకపాత్ర అని చెప్పడంలో సందేహం లేదు అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story