- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూడ్ సీన్‌పై నెటిజన్ జోక్.. అభిమాని కామెంట్‌కి అదిరిపోయే రిప్లై ఇచ్చిన యంగ్ హీరో
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha), బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) జంటగా నటించిన వెబ్ సిరీస్ ‘సిటడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny). ఈ మూవీకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే(Raj &DK) దర్శకత్వం వహించారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో నవంబర్7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అలా అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్‌కు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో వరుణ్, సమంత, బాలీవుడ్ నటులు దీనిపై పోస్టులు పెడుతున్నారు. అలాగే సామ్, వరుణ్.. అభిమానుల పోస్టులకు రిప్లైలు పెడుతూ థాంక్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా ఈ నెటిజన్ కామెంట్‌కి వరుణ్ ధావన్ అదిరిపోయే రిప్లై కూడా ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..
అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఇందులో ఓ ఏపిసొడ్‌లో వరుణ్ ధావన్ సెమీ న్యూడ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశం పై ఓ అభిమాని సరదాగా పోస్టు పెట్టారు. దీనికి ఈ హీరో(Varun Dhawan) కూడా అంతే హాస్యాస్పదంగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరుణ్ సెమీ న్యూడ్ సీన్ గురించి నెటిజన్ పోస్ట్ చేస్తూ.. “ఇప్పటి వరకు సిటడెల్‌లో మూడు ఏపిసోడ్‌లు చూశాను. చాలా బాగుంది. వరుణ్, సమంత ఇద్దరూ వారి యాక్షన్‌తో అదరగొడుతున్నారు. కానీ, వరుణ్‌ను చూస్తే బాధగా ఉంది. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ అతన్ని నగ్నంగా చూపిస్తున్నారు” అని కామెంట్ చేశాడు. ఇక ఈ పోస్ట్‌కు వరుణ్ రిప్లై ఇస్తూ.. “ఈ మొత్తం సిరీస్‌లో నేను ఎక్కువశాతం పూర్తిగా డ్రెస్ వేసుకున్నాను. అది కూడా చూడండి” అంటూ నవ్వుతున్న ఎమోజీలను జోడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.