- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడికా.. వామ్మో.. తొగ్గూడెం మైనింగ్ ఏరియా కి వెళ్లాలంటే జంకుతున్న జనం
దిశ బ్యూరో, ఖమ్మం: తోగ్గూడెంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. కొన్ని క్వారీలకు అనుమతులు ఉన్నప్పటికీ అటవీ, రెవెన్యూ భూముల పరిధిని, సరిహద్దులు దాటి తవ్వి ప్రజాధనాన్ని లూటీ చేస్తుంది మైనింగ్ మాఫియా. అడుగడుగునా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి తొగ్గూడెం క్వారీలలో మైనింగ్ నిర్వహిస్తున్నారు. విద్యుత్, రెవెన్యూ, ఫారెస్ట్ తో సహా ఇతర సంబంధిత అధికారులను తమ గ్రిప్ లో పెట్టుకొని అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. తొగ్గూడెం పరిసర ప్రాంతాల్లో అధికారికంగా కొన్ని క్వారీలకు పర్మిషన్ ఉన్నప్పటికీ, అనధికారంగా సుమారు 6 క్వారీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.
అక్రమ మైనింగ్ తో కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ..
నిబంధనలను అతిక్రమించి అక్రమ మైనింగ్ చేస్తున్నారని తొగ్గూడెం క్వారీలపై బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఫారెస్ట్, రెవెన్యూ, విద్యుత్, మైనింగ్ నిబంధనలకు చట్టాలకు వ్యతిరేకంగా క్వారీలు నడుపుతున్నప్పటికీ అధికారులు వారిని కట్టడి చేసేందుకు కన్నెత్తి కూడా చూడటం లేదు. అనుమతులు కొంతమేర ఉన్నప్పటికీ ఫారెస్ట్, రెవెన్యూ భూములను ఆక్రమించి మైనింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. తమని ఎవరూ ఏమీ చేయలేరని, అనధికార క్వారీలపై చర్యలు తీసుకోవడం ఎవరి వల్ల కాదని అక్రమ మైనింగ్ యజమానులు బాహాటంగానే మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. నిబంధనలు ప్రకారం మైనింగ్ జరిగినచోట మట్టితో ఆ ప్రాంతాన్ని నింపాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటిదేమీ జరగడం లేదు. అక్రమ మైనింగ్ మాఫియా వారి పని కాగానే క్వారీ ని మట్టితో నింపకుండా వదిలేస్తున్నారు. మైనింగ్ చేస్తున్న క్వారీలలో సుమారు 50 శాతం భూమి ఫారెస్ట్, రెవెన్యూ కి చెందిన భూమి అని సమాచారం.
గతంలో పలు పోలీస్ కేసులు..
మైనింగ్ బ్లాస్టింగ్ లో జిలిటెన్ స్టిక్స్ స్టిక్స్ ని వాడతారు. తొగ్గూడెం క్వారీలలో కూడా అదేవిధంగా బాంబ్ బ్లాస్టింగ్ కి జిలిటెన్ స్టిక్స్ ని వాడతారు. ఐదేళ్ల క్రితం కంకర లారీ టిప్పర్ లో మొరంపల్లి బంజర్ వద్ద భారీ ఎత్తున జిలిటెన్ స్టిక్స్ ని బూర్గంపాడు పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ప్రతి నెల క్వారీల యజమానులు పోలీసు అధికారులకు జిలిటెన్ స్టిక్స్ లెక్కలు తెలియ చెప్పాల్సి ఉంటుంది. అసలు వీరికి జిలిటెన్ స్టిక్స్ సప్లై ఎక్కడి నుంచి అవుతుంది, ఎంత మేరకు వాడకం జరుగుతుంది, మిగతా స్టాక్ ఎంత అనే అంశాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గతంలో అప్పటి ఎస్పీ సునీల్ దత్ ఆధ్వర్యంలో ఇక్కడి క్వారీలలో తనిఖీలు నిర్వహించి భారీగా బ్లాస్టింగ్ మెటీరియల్ ని స్వాధీనపరుచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీన కొత్తగూడెం ఓఎస్డి పరితోజ్ పంకజ్, సీఐ వినయ్ కుమార్ తో కలిసి క్వారీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో బ్లాస్టింగ్ మెటీరియల్ లెక్కల్లో తేడా ఉన్నట్లు గుర్తించారు. క్వారీల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ చేసిన ప్రతిసారి లెక్కలను కచ్చితంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని ఆదేశించారు. అయినప్పటికీ యజమానులు వారి తీరు మార్చుకోవట్లేదని సమాచారం.
విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని మైనింగ్ శాఖ సిఫార్సు..
మైనింగ్ శాఖ ఇటీవల తొగ్గూడెం క్వారీలపై చేసిన సర్వేలలో విస్తు పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఫారెస్ట్ రెవెన్యూ భూములలోకి అక్రమంగా చొరబడి బాంబ్ బ్లాస్ట్ లు చేస్తున్నారని మైనింగ్ అధికారుల సర్వేలో తేలినట్లు సమాచారం. అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని నిర్ధారణకు వచ్చిన మైనింగ్ అధికారులు తొగ్గూడెం క్వారీలకు విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులకు సిఫార్సు చేసినట్లు సమాచారం . అయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మైనింగ్ మాఫియా కి భయపడి అటు పక్కకు వెళ్లడానికి కూడా జంకుతున్నట్లు తెలుస్తుంది