వారం వారం మంచిపద్యం: మనసు

by Ravi |   ( Updated:2023-02-06 02:09:04.0  )
వారం వారం మంచిపద్యం: మనసు
X

చాలా సంతోషంగా ఉంది. కొద్దిక్షణాల్లో ముఫ్పై సంవత్సరాల క్రితపు విద్యార్థుల్ని చూడబోతున్నాను. అదే సమయంలో నాతో కలిసి పనిచేసినవారు కూడా తటస్థిస్తారు. అలా అనుకుంటుండగానే కారు రిసార్టులోకి వచ్చింది. అక్కడ అలాంటిదొకటి ఉందనే విషయం తెలియదు. కారు దిగగానే విద్యార్థులు కమ్ముకున్నారు. పదేళ్ళ ప్రాయంలో కనిపించినవారు, నలభైలు దాటాక తటస్థపడ్డారు. అక్కడా అమ్మాయిలదే పైచేయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఫోన్ పిలుపు ద్వారా వచ్చినవాణ్ణి ఎవర్నీ గుర్తుపట్టలేకపోయాను. అందరి పరిచయాలయ్యాయి. కొందర్ని గుర్తుపట్టగలిగాను. గుర్తుపట్టిన వాళ్ళలో బుంగి ఒకడు. పెద్దవాళ్ళమందరం వేదిక ఎక్కాము. పిల్లలందరు ఒక్కొక్కరే వచ్చి నాటి అనుభవాలు, పిల్లచేష్టలు, కొంటెపనులు, వేధించడాలు అన్నీ విడమర్చి చెప్పారు. బుంగి వంతు వచ్చింది వేదిక ఎక్కలేదు ఎక్కమన్నాను.

వేదికపై నుండి మాట్లాడలేను. నేను చిన్నప్పటి నుండీ ఇంతే సార్. ఇప్పుడు కూడా మంది మధ్య మాట్లాడను. ఎందుకో మాట్లాడటమంటే ఇష్టం ఉండదు. ఆఫీస్‌లో కూడా మాట్లాడవా అంటే ఒక్కోక్కరితోనైతే మాట్లాడగలను. ఎందుకంటే సర్ అని చెప్పి వెళ్ళాడు.

గతం చమక్‌మంది చదువుల్లో చురుకు. ఆడపిల్లలకు దూరంగా ఉండేవాడు. నాడే కాదు ఈనాడు కూడా అలాగే ఉన్నాడు. బాధ్యతల్ని నిర్వహించడంలో దిట్ట. వాడిని ఆటపట్టించిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. అంతటి బుద్దూ మరి. మొత్తానికి కార్యక్రమం పూర్తయింది. భోజనాలకు లేచాం. తినడం పూర్తయింది. మమ్మల్ని సాగనంపుటకు విద్యార్థి బృందం అంతా కదిలింది. మనసు నిండింది.

ముప్పైయేళ్ళ తరువాత కలిసినా ఒక్క మాటా లేదు, ముచ్చటా లేదు, గుంపు నుండి వినపడింది. అంది బుంగి గురించేనని వేరే చెప్పాలా!

కలిసి మెలగిన మిత్రులు కలిసినపుడు

మాట కలపకపోయిన మనసు విరుగు

ఎరుక తెలియగా మెదిలిన కరుగు మనసు

కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము

బీవీఎన్ స్వామి

9247817732

Also Read..

కవిత: కళా తపస్వి

కవిత: ప్రతిబింబం

Advertisement

Next Story

Most Viewed