గుల్జార్ షాయరీ కవిత

by Ravi |   ( Updated:2024-11-24 20:30:31.0  )
గుల్జార్ షాయరీ కవిత
X

ప్రఖ్యాత కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది. కవయిత్రి గీతాంజలి దీన్ని తెలుగులోకి అను సృజన చేశారు. గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను అలరిస్తాయి.

నన్ను ఇంతగా ఎడిపిస్తున్నావేంటి జీవితమా …/ ఒక్క సారి వెళ్ళి మా అమ్మని అడిగి రాపో …/ ఎంత గారాల బిడ్డనో నేను ?

జీవితం అంటే ఒక మార్గం. ఈ మార్గంలో మనకు అనేక ఘట్టాలు ఉంటాయి. ఇవి మనకు అనుభవాన్ని అందించి మనసును బలపరుస్తాయి. జీవితం మనకు ప్రతి క్షణం కొత్త పాఠాలను నేర్పుతుంది. జీవితం అంటే కేవలం సుఖం, సంతోషాల సమాహారమే కాదు. జీవితం బాధలు, కష్టాలు, కన్నీళ్లు, సవాళ్లతో కూడినదిగా ఉంటుంది. జీవితంలో చెలరేగే సంఘర్షణలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. జీవితంలో విజయం పొందేందుకు మార్గం చూపిస్తాయి. కుటుంబం, ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో ఉండే అనుబంధాలు, సమాజంలో మనకు ఉండే సంబంధాలు జీవిత పరమార్థాన్ని తెలియజేస్తాయి. జీవితం మనకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది. జీవితం అందించిన సరి కొత్త అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి. మనం రోజును కొత్తగా ఆరంభం చేయడానికి జీవితం అవకాశం కల్పిస్తుంది.

తెరిచిన పుస్తకం జీవితం

జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఆ పుస్తకంలోని ప్రతి పేజీ మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది. మనం ఆ పుస్తకంలోని చివరి పేజీకి చేరేలోపే వాటిని ఆస్వాదించాలి. ఈ షాయరీ కవితలోని భావాలు తీవ్రమైన వ్యధను, నిరాశను, విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 'నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావేంటి' అనే వాక్యంలో జీవితం తనను ఎందుకు ఇలా మితిమీరిన కష్టాలకు,బాధలకు గురి చేస్తోంది? భరించలేని దుఃఖాన్ని, బాధలను తట్టుకోలేకపోతున్నాను అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. జీవితంలో ప్రశ్నగా మిగిలిన తన స్థానం ఏమిటి? జీవితంలో తాను పొందిన తీవ్రమైన బాధలు, తాను ఎదుర్కొన్న కష్టాలు, భావోద్వేగాలు అతని కవితలో వ్యక్తమవుతున్నాయి.

అమ్మ అండతోనే శాంతి

కాని మా అమ్మ నా గురించి ఎంతో ప్రేమగా ఆలోచించేది, నేను ఎంత విలువైన వాడినో అని గుర్తు చేసుకొనేది, గారాల బిడ్డ అనే పదం తనకు తల్లికి గల ఆత్మీయతను, ప్రేమను, అనుబంధాన్ని తెలియజేస్తుంది. జీవితం మనకు కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తుంది. అలాంటి కష్ట సమయంలో మనకు అండగా నిలిచే ఏకైక వ్యక్తి అమ్మ. అమ్మ తన బిడ్డల మీద చూపిన ప్రేమ జీవితంలో వారు తనకు ఎంత ముఖ్యమైన వారో తెలియజేస్తుంది. తాను అపురూపంగా చూసుకునే తన తల్లి సహాయంతో శాంతిని పొందుతున్నాడు. వ్యక్తి తల్లి ప్రేమను, ఆదరణను కాంక్షిస్తున్నాడు. తల్లికి తన పట్ల అపారమైన ప్రేమ, తనను తల్లి ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకంగా, ప్రేమగా, ఆదరణగా చూసేది. తల్లి తన పట్ల ఎంతో ప్రేమను కురిపించేది. తల్లి తనను ఎంతో విలువైన బిడ్డగా చూసేది.

కష్టాలను మరిపించేదే తల్లి ప్రేమ

ఇప్పుడు తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు ఎంతో భిన్నంగా ఉన్నాయి. జీవితంలోని నిరాశ, కష్టాలు తల్లి చూపించిన అపారమైన ప్రేమను గుర్తు చేస్తున్నాయి. జీవితంలో బాధలను అనుభవిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక్కసారి అనే పదం వ్యక్తి ఆత్రుతను, ఆరాటాన్ని తెలియజేస్తున్నది. ఈ కవితలోని భావం చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడి సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా ఉంది. మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంఘర్షణ ఈ కవితలో వ్యక్తం అవుతున్నది. వ్యక్తి ఆవేదనను, నిస్సహాయతను జీవితంలో ఉన్న అసమానతల పట్ల అసహనాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది. కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.

సమీక్షకులు

నరేంద్ర సందినేని

70930 30259

Advertisement

Next Story

Most Viewed