వేకువ పుష్పం

by Ravi |
వేకువ పుష్పం
X

న భావాలను పంచి, మంచికి బాటలు వేసి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన భాషా నిపుణులు డాక్టర్ సుధాకర్. హిందీ ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పడమే కాకుండా, ఎంతోమంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి ఉత్తమ గురువులుగా తీర్చిదిద్దారు. ప్రకృతిలో కనిపించిన ప్రతి వస్తువు మీదా కవితలల్లి సమాజానికి చేరువ చేస్తున్నారు. కవిత్వంతోపాటు గేయం, కథ, పద్య రచనలతో ఎంతగానో అబ్బురపరుస్తున్నారు. తాను రచనలు చేయడమే కాకుండా, విద్యార్థుల చేత కూడా రచనలు చేయించి వారిని బాల కవులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆయన కలం నుంచి వెలువడిందే 'వేకువ పుష్పం' కవితా సంపుటి. ఇందులోని ప్రతి కవిత కండ్లలో కదలాడుతూ, జీవితగమనాలను సాక్షాత్కారింపజేస్తుంది.

'మట్టి నా శ్వాస' కవితలో 'తన గర్భంలో విత్తును దాచుకుని-శ్వాసకు తర్ఫీదునిస్తూ-తల ఎత్తుకునేలా పెంచి-తలదన్నే సుగుణాలతో-రంగుల ప్రపంచాన్ని సృష్టించే మట్టే నా శ్వాస' అంటారు. ' విశ్వమంతా ఒకటే అయినా-అడ్డుగోడల ఆటలెందుకో-మానవాళి ఒక్కటే అయినప్పుడు-మారణహోమాలెందుకో' అంటూ 'అడ్డుగోడలు' కవితలో ప్రశ్నలు సంధిస్తారు. 'వేకువ పుష్పం' కవితా సంపుటిలోని 108 కవితలలో ఒక్కో కవితకు ఒక్కో ప్రత్యేకత ఉంది. డాక్టర్ సుధాకర్ సాహిత్యం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలువాలని, అనువాద రచనలలో కూడా ప్రావీణ్యత చూపి, విశ్వ ఖ్యాతినొందాలని ఆశిద్దాం.

ప్రతులకు:

డాక్టర్ బి.సుధాకర్

12-1-103/A, భారత్ నగర్

సిద్ధిపేట, తెలంగాణ

పేజీలు: 108,. ధర :100/-

98492 43908

సమీక్షకులు:

ఉండ్రాళ్ల రాజేశం

సిద్దిపేట

99669 46084

Advertisement

Next Story

Most Viewed