- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెచ్చిపోతున్న లిక్కర్ సిండికేట్ మాఫియా.. ‘బీర్లు’ లేక ప్రజలు ఆగమాగం
దిశ ప్రతినిధి, కరీంనగర్ : కింగ్ ఫిషర్ బీర్ తాగి కింగ్ లా ఎంజాయ్ చేయాలనుకున్న వారిని విగతజీవులుగా మార్చిన ఘటనలు లేకపోలేదు. జగిత్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ బీర్లు దొరక్కపోవడంతో వాటిని కొనుక్కునేందుకు ఇరుగుపొరుగు జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి తయారైంది. ప్రొహిబిషన్ సమయంలో మందుబాబులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లినట్టుగానే జగిత్యాల జిల్లావాసులు పొరుగు జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి తయారైంది. లిక్కర్ సిండికేట్ మాఫియా కారణంగా జరుగుతున్న ఈ తంతును కట్టడి చేసేందుకు చట్టాలు కూడా మూగబోయాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాకు చెందిన వారు కింగ్ ఫిషర్ బీర్ల కోసం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, పెద్దపల్లి జిల్లా ధర్మారం, నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి, సిరిసిల్ల జిల్లా వట్టెంలా ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి తయారైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుని కింగ్ ఫిషర్ బీర్లు కొనుక్కునేందుకు డ్యూటీలు కూడా వేసుకుంటున్నారట. వంతుల వారీగా ఇరుగు పొరుగు జిల్లాలకు వెళ్లి బీర్లను కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల జిల్లా కింగ్ ఫిషర్ బీర్ ప్రియులు. అయితే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రాంతానికి వెళ్లి బీర్లు కొనుగోలు చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఒకటి రెండు ఘటనల్లో ప్రాణాలు కూడా కోల్పోయారని జగిత్యాల ప్రాంతాల వాసులు తెలిపారు. మద్యం సిండికేట్ మాఫియా వల్ల అన్ని రకాల బ్రాండ్లను విక్రయించాల్సిన వ్యాపారులు సాహసించేందుకు ముందుకు రావడం లేదన్న చర్చ సాగుతోంది.
అండదండలు ఎవరివో..?
లిక్కర్ సిండికేట్ మాఫియా చెలరేగిపోతున్న తీరుపై కూడా సర్వత్రా చర్చ సాగుతోంది. ‘బట్టలూడదీసి కొడ్తాం’ మాకేమిస్తావో చెప్పు, మేం తలుచుకుంటే ఏమైనా చేస్తాం అంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నా నియంత్రిచేవారే లేకుండా పోయారన్న విమర్శలు వస్తున్నాయి. నిర్భయంగా చెలరేగిపోతున్న మాఫియాకు వెన్నుదన్నుగా బలమైన వారే నిలుస్తున్నారని ఈ కారణంగానే వారు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
బడా బాబుల అండదండల కారణంగా మాఫియా రెచ్చిపోతోందని, ఇందుకు ఎక్సైజ్ శాఖ కూడా వత్తాసు పలుకుతోందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే పలువురు జగిత్యాల కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం, కింగ్ ఫిషర్ బీర్ల కోసం ఆందోళనలు చేయడం వంటి చర్యలకు పూనుకున్నా.. ఎక్సైజ్ అధికారులు మాత్రం ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించకపోవడం గమనార్హం. ఏది ఏమైనా జగిత్యాలలో లిక్కర్ సిండికేట్ మాఫియాపై కొరడా ఝులిపించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.