ఆ అండదండలతోనే మద్యం విక్రయాలు? 

by Shyam |   ( Updated:2020-03-29 07:46:59.0  )
ఆ అండదండలతోనే మద్యం విక్రయాలు? 
X

దిశ, మహబూబ్‎నగర్: అధికార పార్టీ అండదండలు ఉంటే.. తమకు ఎలాంటి నిబంధనలు వర్తించవని కొంతమంది నాయకులు ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ నియంత్రణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్‎ విధించారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలపై కఠిన ఆంక్షలు విధించి మూసివేశారు. అయితే మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్‌ మండల కేంద్రంలో ఉన్న ఓ వైన్స్ షాపు నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో రాత్రి 10 గంటల తర్వాత అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నారని చెబుతున్నారు. ఆ షాపుకు అధికారులు సీల్ వేశారో, వేయలేదో అన్న అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. ఒకవేళ వేసినా కూడా సీల్ తీసి మరీ అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని సమాచారం. ఫిర్యాదు చేసినప్పటికీ ఆ తర్వాత కూడా ఆ వైన్ షాపుకు సీల్ వేయలేదు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న స్థానికులు శ్రీసాయివైన్స్ షాపు లైసెన్సును రద్దు చేసి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags: Ruling party leaders Alcohol sales, lockdown, makthal

Advertisement

Next Story

Most Viewed