- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరడోనాకు నివాళి.. మెస్సీకి జరిమానా
దిశ, స్పోర్ట్స్ : సాకర్ దిగ్గజం డిగో మరడోనా ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, అతడి మరణానికి నివాళి అర్పించినందుకు గాను అర్జెంటీనా ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీకి జరిమానా విధించారు. నివాళి అర్పిస్తే జరిమానా విధిస్తారా అనే అనుమానం మీకు రావొచ్చు. అయితే స్పానిష్ సాకర్ ఫెడరేషన్ నిబంధనలు అతిక్రమిస్తూ నివాళి అర్పించినందుకుగాను మెస్సీకి జరిమానా విధించారు. చాంపియన్స్ లీగ్‌లో భాగంగా ఆదివారం ఒసాసునాతో బార్సిలోనా జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో 4-0 తేడాతో బార్సిలోనా జట్టు విజయం సాధించింది.
అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో మెస్సీ గోల్ చేసి తన జెర్సీని విప్పేసి లోపల ఉన్న మరడోనా జెర్సీని ప్రదర్శించాడు. ఆకాశం వైపు చూస్తూ ముద్దులు పెడుతూ మరడోనాకు నివాళి అర్పించాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో జెర్సీని తీసేసి.. వేరే జెర్సీని ప్రదర్శించినందుకు రిఫరీ అతడికి ఎల్లో కార్డ్ చూపించాడు. స్పానిష్ సాకర్ లీగ్ మెస్సీకి 600 యూరోల జరిమానా, బార్సిలోనా జట్టుకు 180 యూరోల జరిమానా విధించింది. కాగా, ఈ జరిమానాపై మెస్సీ, బార్సిలోనా క్లబ్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నది.