- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగిత్యాల వాసిపై కాశ్మీరులో దేశద్రోహం కేసు?
దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లా కుస్థాపూర్‌కు చెందిన సరికెల లింగన్న అనే వ్యక్తిని మంగళవారం జమ్మూకాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ముందే దేశద్రోహం కేసులో అరెస్టయిన రాకేశ్ అనే జవాన్‌కు లింగన్న డబ్బులు పంపించడమే కారణంగా తెలుస్తోంది. రాకేశ్ అనే వ్యక్తి జమ్మూలోని ఆర్మీబేస్ క్యాంపులో విధులు నిర్వర్తించేవాడు. ఇతనికి పాకిస్తాన్‌కు చెందిన అనిత అనే మహిళ వలపు వల విసిరింది. అందులో చిక్కుకున్న అతడు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన విషయాలను రహస్యంగా ఆ మహిళకు చెప్పేవాడు. విషయం తెలుసుకున్న ఆర్మీ, జమ్మూ పోలీసులు రాకేశ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసి అతని అకౌంట్స్, కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే అతని ఖాతాలోకి డబ్బులు రావడంతో ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్టు గుర్తించిన పోలీసులు మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. స్థానిక పోలీసుల సాయంతో లింగన్నను అరెస్టు చేసి మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. రాకేష్‌కు నీకు సంబంధం ఏంటనీ పోలీసులు ప్రశ్నించగా దుబాయ్‌లో ఉంటున్న తన మిత్రుడి కోరిక మేరకు గూగుల్ పే ద్వారా రూ.5వేలు పంపానని, అంతకుమించి తనకు ఏమీ తేలిదని లింగన్నబదులిచ్చినట్టు తెలుస్తోంది.
ఇంతకు ముందు కూడా లింగన్నరాకేశ్‌కు రూ.4వేలు పంపినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 13న రూ.5వేలు, 25న రూ.4వేలు మొత్తంగా రూ.9వేలు రాకేష్ అకౌంట్‌కు బదిలీ చేసినట్టు జమ్మూపోలీసులు గుర్తించారు. కాగా, రాకేశ్‌కు లింగన్నకు మధ్య సంబంధం ఏమిటీ? దుబాయ్‌లోని మిత్రుడు కావాలనే రాకేశ్ నెంబర్ ఇచ్చారా అనే కో్ణంలో కూడా జమ్మూపోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. అయితే 2సార్లు పైసలు పంపినప్పడు దుబాయ్‌లోని తన మిత్రునికి కాకుండా వేరే వ్యక్తికి వెళుతున్నాయని లింగన్న ఎందుకు గుర్తించలేదు. లేదా దుబాయ్‌లో నివిసించే వ్యక్తికి, రాకేశ్‌కు ఏమైనా సంబంధం ఉన్నదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు జమ్మూపోలీసులు తెలిపారు.