- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డిప్రెషన్‌తోనే నిద్ర లేస్తున్న యూత్.. సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి!
దిశ, ఫీచర్స్ : ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. నిద్రలేవగానే పాజిటివ్‌గా థింక్ చేయాలి అంటారు. కానీ ప్రస్తుతం చాలా మంది డిప్రెషన్‌తోనే నిద్రలేస్తున్నారంట.తాజాగా ఫిన్లాండ్లోని మానసిక పరిశోధకులు బయట పరిస్థితుల ప్రభావం మనుషులపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందనే దానిపై అధ్యయనం చేసి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిపారు.
ఒక వ్యక్తి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే అతను పూర్తి ఆరోగ్యవంతుడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ చాలా నిరాశ, నిస్పృహలకు గురి అవుతున్నారు. కొంత మంది అతిగా ఆలోచించి, ఏం చేయాలో, ఫ్యూచర్ ఏంటి అని తెలియక డిప్రెషన్‌లోకి వెళ్లిపోతే, మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా చేసిన పరిశోధనలో,స్త్రీలలో ప్రతీ ఐదుగురిలో ముగ్గురు పాజిటివ్ ఆలోచనలతో నిద్రలేస్తే, మగవారిలో ఒకరు మాత్రమే పాజిటివ్ ఆలోచనలతో నిద్రలేస్తున్నట్లు తెలియజేశారు. మానసిక ఆరోగ్యం అనేది స్త్రీ,పురుషులకు ఇద్దరికీ చాలా అవసరం కానీ, కొన్ని రకాల నిరాశలు, మన చేతుల్లో లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, ఎక్కువగా ఆందోళనకు గురి అవుతున్నారంట. చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం, కొందరిని నిరాశలోకి తీసుకెళ్తే, నిద్ర లేస్తే ఏమి ఫేస్ చేయాల్సి వస్తుందోననే భయంతో కొందరు ఉన్నట్లు వారు పేర్కొన్నారు.