అన్నం ఇలా వండి తింటే అస్సలు బరువు పెరగరు!

by Sumithra |
అన్నం ఇలా వండి తింటే అస్సలు బరువు పెరగరు!
X

దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది అన్నం తినడం వలన బరువు పెరుగుతారు అని చాలా తక్కువ మోతాదులో తింటూ ఉంటారు. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా అన్నం తినకూడదు అంటారు. కానీ ఆయుర్వేదంలో షుగర్, థైరాయిడ్, పీసీఓడి సమస్యలు ఉన్నవారు కూడా అన్నం తినొచ్చని చెబుతున్నారు. అయితే అన్నం వండే బియ్యంలో కూడా ఎన్నో రకాల బియ్యం ఉంటాయి. ఒక్కో రకం బియ్యంలో వేరే వేరే పోషక విలువలు, అలాగే ఒక్కో రకం బియ్యం ఒక్కో రుచిని కలిగి ఉంటాయి.

అయితే అన్నం వండే విధానాన్ని బట్టి పోషకాలు, మంచి ఆరోగ్యం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బియ్యంలోని కార్బోహైడ్రేట్స్‌ శరీరానిక శక్తిని ఇస్తాయి. బియ్యంలో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియకి హెల్ప్ అవుతుంది. పొటాషియం, బి విటమిన్, ఐరన్, మెగ్నీషియం అనేక పోషకాలను శరీరానికి ఇస్తుంది. మరి మంచి ఆరోగ్యం కావాలంటే ఎలాంటి బియ్యంతో అన్నం వండాలి, ఏ విధంగా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అన్నం వండే ముందు బియ్యం ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తరువాత 1 కప్పు బియ్యంలో 4 కప్పుల నీళ్లు పోసి చిటికెడు ఉప్పు 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసి ఉడికించి ఎక్కువగా ఉన్న నీళ్లని వంపాలి. వంపిన నీళ్లని సూప్ లాగా తాగొచ్చు. ఇలా వండిన అన్నం తినడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుంది. అంతే కాదు అన్నం కూడా పొడిపొడిగా ఉండి మంచి రుచిగా ఉంటుంది. బరువు కూడా పెరగరు. తక్కువ క్వాంటిటీలో తిన్నప్పుడు మాత్రమే ఈ లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed