- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క చాక్లెట్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే
దిశ,ఫీచర్స్: చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాక్లెట్ ను ఇష్టంగా తింటారు. తీపి ఎక్కువగా ఉండే చాక్లెట్స్ తినడం వల్ల మీ ఆరోగ్యానికి మేలు చేయడం కంటే ఎక్కువ హాని చేస్తుందని కొందరు గట్టిగా నమ్ముతారు. చిన్న పిల్లలు చాక్లెట్స్ తింటే.. వారి దంతాలు పాడవుతాయని తిననివ్వరు. తల్లితండ్రులు తమ పిల్లలను వీలైనంత వరకు చాక్లెట్‌కు దూరంగా ఉంచుతారు. మరి అంతలా చాక్లెట్లకి దూరంగా ఉండాల్సిన అవసరం లేదట.
ఎందుకంటే చాక్లెట్స్ వల్ల కూడా మనకు అనేక ప్రయోజనాలను కలుగుతాయి. మనం తినే మామూలు చాక్లెట్స్ కన్నా డార్క్ చాక్లెట్స్ చాలా మంచివని అంటున్నారు. ఈ డార్క్ చాక్లెట్లలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఈ డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని దక్షిణ కొరియన్ పరిశోధకులు ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది.
డార్క్ చాక్లెట్ మన ఆరోగ్యంపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపే సూక్ష్మజీవులను కూడా ప్రభావితం చేస్తుందని. మన ఆరోగ్యాన్ని మెరుగుపరస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు మూడు సార్లు 30 గ్రాముల చాక్లెట్ తినడం వల్ల మన మూడ్ స్వింగ్స్ కూడా తగ్గిపోయి ఎప్పుడూ ఆనందంగా ఉల్లాసంగా ఉంటామట. డార్క్ చాక్లెట్ మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి క్యాన్సర్, ఆర్థరైటిస్, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి.