- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎండలకు పెరుగు పుల్లగా కాకుండా రుచికరంగా ఉండాలంటే ఈ బెస్ట్ టిప్స్ ఫాలో కావాల్సిందే..!
దిశ, ఫీచర్స్: వేసవిలో పెరుగు తినడం వల్ల మనకు చాలా రకాల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది. ఇదంతా బానే ఉంది కానీ... అసలు వచ్చిన సమస్య ఇక్కడే ఉంది.. అదేంటంటే ఈ ఎండాకాలం పెరుగు ఊరికే పుల్లగా అయిపోతుంటది. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే అలాగే జరుగుతుంది. దీంతో తినాలనే కోరిక కూడా చచ్చిపోతుంది. అయితే పెరుగు అలా పుల్లగా మారకుండా ఉండాలంటే మనం పెరుగు తోడు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానివల్ల పెరుగు చాలా కాలం వరకు పుల్లగా మారకుండా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జాగ్రత్తలేంటో చూసేద్దామా..
*సహజంగా పాలను మనం పగలు తోడు వేస్తారు. అలా కాకుండా ఈ సారి నుంచి రాత్రిపూట తోడు వేయండి. ఎందుకంటే.. రాత్రి పూట ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉంటాయి. ఆ సమయంలో తొందరగా పెరుగు పుల్లగా మారకుండా అడ్డుపడుతుంది. అలా కాకుండా.. పగలు సమయంలో పాలు తోడు వేస్తే ఆ వేడికి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా పుల్లగా అయిపోతుంది.
* వేసవిలో, పెరుగు తోడు వేసే బౌల్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని కోసం, స్టీల్ లేదా గాజు గిన్నెకు వాడకుండా మట్టి కుండను వాడడం వలన పెరుగు తోడుకున్న తర్వాత ఆ మట్టి కుండ నీటిని గ్రహించి పెరుగు పుల్లగా మారకుండా చేస్తుంది. నిజానికి, నీటిని విడుదల చేయడం వల్ల పెరుగు త్వరగా పుల్లగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మట్టి కుండలో పెరుగు వేస్తే, అది చిక్కగా, క్రీమీగా మారడమే కాకుండా, పుల్లగా మారదు.
*పెరుగు తయారు చేసేటప్పుడు, పాలు మరీ చల్లగా, మరీ వేడిగా ఉండకుండా గోరు వెచ్చగా ఉండేలా చూసుకోండి.
*పాలు తోడేసిన తర్వాత, దానిని వేడిగా ఉండే ప్లేస్‌లో ఉంచకూడదు. అలా కాకుండా మీరు వేడిగా ఉన్న ప్లేస్‌లో పెట్టడం వలన పెరుగు త్వరగా పుల్లగా మారుతుంది. కాబట్టి ఫ్రిజ్‌లో పెట్టడానికి ప్రిఫర్ చేయండి. ఇన్‌కేస్ ఫ్రిజ్ లేకపోతే దానిని చల్లని ప్రదేశంలో ఉంచండి.
*కొంతమంది తోడులో స్టార్టర్ ఎక్కువ కలిపితే రుచిగా వస్తుందని భ్రమపడి దానికోసం ఎక్కువ స్టార్టర్ కలిపేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పెరుగు పుల్లగా మారిపోతుంది.
*ఇక లాస్ట్ అండ్ బెస్ట్ టిప్ పెరుగు తోడు వేసేటప్పుడు కచ్చితంగా ఫ్రెష్ పెరుగును స్టార్టర్‌గా యూజ్ చేయాలని మస్ట్ అండ్ షుడ్‌గా గుర్తుంచుకోండి.