- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల్లో ఒత్తిడిని పెంచుతున్న వర్క్ ఫ్రమ్‌హోమ్.. ఇది వారి వ్యక్తిగత జీవితాన్ని దెబ్బ తీస్తుందా?
దిశ, ఫీచర్స్ : కరోనా తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. అంతే కాకుండా కొంత మంది మహిళలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉండి పని చేయడం వలన తన పిల్లలను చూసుకోవచ్చు, ఇంటి పని చేసుకోవచ్చు అని ఆలోచించి ఇంటి నుంచి వర్క్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కానీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మహిళల వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీస్తుంది అంటున్నారు కొందరు.
తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అందులో ఓ మహిళ జాబ్ రిజైన్ చేసి, తాను ఉద్యోగానికి రాజీనామ చేయడానికి గల కారణాలను తెలియజేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రతి మహిళలకు డబుల్ డ్యూటీ లాంటింది. ఆఫీసు వర్క్ చేస్తూ.. ఇంట్లో పని చేయడం అనేది చాలా కష్టం. అది ప్రతి ఉమెన్‌కు అదనపు భారంగా మారుతుంది. అంతే కాకుండా వారు ఖాళీగా ఉన్నట్లు ఇంట్లో వారు నిందించడం, కావాలనే అదనపు పని వారిపై వేయడం, కొన్ని సార్లు ఇంటిలోని సభ్యులు వారిని గౌరవించడం కూడా చేయరు. ఇది మహిళలపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వలన ఇంట్లో పని వలన కొన్ని సార్లు ఆ మహిళలు ఉద్యోగ జీవిత సమతుల్యత దెబ్బతింటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇటు వర్క్ పై ఫోకస్ చేయలేక అటు ఇంట్లో పని కూడా పూర్తి చేయలేక వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంట.
అయితే ఒక అమ్మాయి, తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ.. జాబ్ రిజైన్ చేయడం అనేది చాలా పెద్ద విషయం, కానీ నేను నా ఉద్యోగానికి రిజైన్ చేయడానికి కారణం వర్క్ ఫ్రమ్ హో. నేను ఇంట్లో ఉండి వర్క్ చేయడం వలన నా జాబ్‌ను నా తల్లిదండ్రులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. వారు నాకు అదనపు పని చెప్తూ డ్యూటీని సరిగ్గా చేయడం లేదు. ఇటు వర్క్ ప్రెషర్, ఇంట్లో పని ఈ ఒత్తిడి ఇవన్నీ భరించలేక జాబ్‌కు రిజైన్ చేసినట్లు ఆమె పేర్కొంది ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.