మాటలు మార్చేస్తాయ్!.. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో అవే కీలకమంటున్న నిపుణులు

by Javid Pasha |
మాటలు మార్చేస్తాయ్!.. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో అవే కీలకమంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : ‘మంచి మాట చాలు మనసులో గాయంబు మాన్పజాలు గొప్ప మందువోలె’ అన్నాడో ప్రముఖ కవి. అంతేకాదు ‘వాక్కు కున్న పదును వాడి కత్తికి లేదు.. మార్చ గలదు మాట మనిషి మనసు.. జార వలదు నోరు జాగ్రత్త.. జాగ్రత్త’ అని కూడా అన్నారు. దీనిని బట్టే మనిషి నోటి నుంచి వెలువడే మాటకు ఎంత పవర్ ఉంటుందో, ఒకరిని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పర్సనల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ నిపుణులు. అందుకే అందరితో మంచిగా మాట్లాడాలని సూచిస్తు్న్నారు.

* ఆనందంలో, ఆవేశంలో, భావంలో, భావోద్వేగంలో.. ఇలా ఎప్పుడైనా, ఎక్కడైనా మాట మనసు లోతుల్ని తాకుతుంది. హృదయాంతరాన్ని మీటుతుంది. అది మంచిదైతే మీ గౌరవాన్ని పెంచుతుంది. చెడ్డదైతే మిమ్మల్ని దోషుల్ని చేస్తుంది. అందుకే ఒక మాట మాట్లాడే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించండి. అనవసరంగా నోరు జారకండి’ అంటుంటారు అంటుంటారు పెద్దలు. అందుకే ఎప్పుడెలా మాట్లాడో తెలిసి మసలు కోవడం మంచిదని వివరిస్తున్నారు నిపుణులు.

* నిజం చెప్పాలంటే మన థాట్స్ అండ్ బిహేవియర్స్ ఎలా ఉంటాయనేది కూడా మాటల ద్వారా తెలిసిపోతుంది. అందుకే ‘జాగ్రత్తగా మాట్లాడండి. ఆలోచించి మాటివ్వాలని, ఒక్కసారి మాట జారితే.. అతి ప్రతికూల ప్రభావం చూపేది అయితే గనుక తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు చెప్తుంటారు. ఇతరులు బాధపడకుండా, ఈ సమాజాన్ని కించపర్చకుండా, నలుగురిలో మీకు గౌరవం పెరిగేలా మాట్లాడటం చాలా మేలు చేస్తుందని అంటారు. మీ అభిప్రాయాలను కూడా ధైర్యంగా తెలియజేయడమే గ్రేట్ కమ్యూనికేసన్ స్కిల్స్‌లో భాగమని పేర్కొంటున్నారు.

* జస్ట్ మాటలే కదా అప్పటి పూర్తికి ఏదో ఒకటి చెప్పేస్తే పోలా అనుకోకండి. ఎందుకంటే మాటల్లో మీరు ఊహించలేనంత పవర్ ఉంటుంది. అవి ఇతరులకు మేలు చేసేవి అయితే మీకు మంచి పేరు తెస్తాయి. మీలో విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా నింపుతాయి. కాబట్టి ఆచి తూచి అడుగు వేయాలనేది నిపుణుల సూచన.

* ప్రతిరోజూ మనకు ఎన్నో ఆలోనలు తడుతుంటాయి. మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో అన్నీ మనకు అనుకూలంగానే ఉంటాయనుకుంటే పొరపాటే. కాకపోతే ఇవన్నీ మాటల రూపంలోనే సమాజానికి కమ్యూనికేట్ అవుతుంటాయి. కొన్ని మాటలు ఆనందాన్ని కలిగిస్తే, మరికొన్ని ఆవేశాన్ని రగిలిస్తాయి. అలాంటప్పుడు మీకు నచ్చలేదని కఠినమైన మాటను ఉపయోగించవద్దు అంటున్నారు కమ్యూనికేషన్ అండ్ పర్సనల్ స్కిల్స్ నిపుణులు. ఆమోదయోగ్యమైన మాటలతోనే అన్నీ వివరించాలని, స్వీకరించాలని, భావాలను వ్యక్తీకరించాలని అంటున్నారు.

* కొన్నిసార్లు మన మాటలవల్ల ఇతరులు భావోద్వేగాలకు లోనుకావచ్చు. లేకపోతే ఇతరుల మాటలు విని మనం కూడా ఎమోషనల్ అవ్వొచ్చు. ఇంకొన్ని సార్లు ఆ మాట ఎందుకు అన్నానో అని బాధపడుతుంటారు కొందరు. మరికొన్నిసార్లు ఆ విషయంలో మాట ఇవ్వకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. ఎందుకంటే జీవితమే ఒక ‘మాటల నావ’పై నడుస్తూ ఉంటుంది. అందుకే మంచీ చెడూ అన్నీ మాటల మయమే. కాబట్టి కమ్యూనికేట్ చేసే సందర్భంలో మీరు ఉపయోగించే మాటలు అందరి క్షేమాన్ని కోరాలి. అందరికీ మేలు చేయాలి అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed