మీ భర్త ఆరోగ్యంగా ఉండాలా.. అయితే ఈరోజుల్లో అస్సలు గాజులు ధరించకండి

by samatah |   ( Updated:2023-03-24 05:02:47.0  )
మీ భర్త ఆరోగ్యంగా ఉండాలా.. అయితే ఈరోజుల్లో అస్సలు గాజులు ధరించకండి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆడపిల్లల చేతుకులకు గాజులు చాలా అందాన్ని ఇస్తాయి. అందుకే చాలా మంది తమకు నచ్చిన డిజైన్స్ గాజులు ధరిస్తుంటారు. ఇక మన హిందూ మతంలో మహిళలకు పదహారు అలంకరణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే గాజులు అనేవి అందానికే కాకుండా అదృష్టానికి కూడా చిహ్నంగా పరిగణిస్తారు, అలాగే అవి ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని చక్కగా ఉంచుతాయి అంటారు.

వివాహిత స్త్రీలు ఏ రంగుల కంకణాలకు దూరంగా ఉండాలి. ఎప్పుడు? ఏ రోజు ? గాజులు ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారో తెలుసుకుందాం. అయితే పెళ్లైన స్త్రీలు శాస్త్రాల ప్రకారం మంగళ, శనివారాల్లో స్త్రీలు కొత్త గాజులు ధరించకూడదు. ఈ రోజున గాజులు కొనడం అశుభం. ఇలా చేయడం వల్ల దాని ప్రభావం ఆ స్త్రీ భర్త దురదృష్టానికి దారి తీయవచ్చు. అయితే కొత్త గాజులు ధరించడానికి ఆది, శుక్రవారాలు మంచి రోజులంట. అంతే కాకుండా ఏవైనా కొత్త గాజులు ధరించే ముందు గౌరీ మాత ఆశీర్వాదాలు తప్పకుండా తీసుకోవాలంట.

ఇవి కూడా చదవండి: ఎండాకాలంలో నీళ్లు బిందెలలో వేడిగా, కుండలో చల్లగా ఉంటాయి ఎందుకని..?

Advertisement

Next Story

Most Viewed