- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాపం అక్కడ ఆడోళ్ల నైటీలు ఇక్కడ మగాళ్ల లుంగీలు బ్యాన్.. ఎందుకంటే?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో పల్లె, పట్టణాలు తేడా లేకుండా మహిళలు నైటీలు ధరిస్తున్నారు. కొంతమంది ఆడవాళ్లు కేవలం రాత్రి పూట మాత్రమే నైటీ వేసుకుంటే మరికొంతమంది డే మొత్తం నైటీలోనే ఉంటారు. నైటీ వేసుకుంటే ప్రశాంతంగా, ఫ్రీగా ఉంటుంది. మార్నింగ్ స్నానం చేయగానే నైటీ వేసుకుని ఇల్లంతా తిరుగుతారు. ఆడవాళ్లంతా పట్టు చీరలకన్నా నైటీలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పలువురు కాటన్ నైటీలు ధరించగా.. మరికొంతమంది పాలిస్టర్ వి వాడుతుంటారు.
అయితే ఓ ప్రాంతంలో నైటీలు ధరిస్తే ఏకంగా 2 వేల రూపాయల జరిమానా వేస్తున్నారు. మరీ ఆ ప్రాంతం ఎక్కడో చూద్దాం.. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లిలో కొన్నాళ్ల క్రితం మహిళలు నైటీలు వేసుకోకూడదని గ్రామ పెద్దలు తీర్మానించారట. కేవలం రాత్రి 7 గంటల నుంచి మార్నింగ్ 7 గంటల సమయం వరకే నైటీలు ధరించాలని.. ఈ రూల్ క్రాస్ చేస్తే మాత్రం తప్పకుండా రూ. 2 వేలు ఫైన్ కట్టాల్సిందేనని చెప్పారట. నైటీ వేసుకుని పలు పనుల కోసం (కూరగాయలు కొనడానికి వెళ్లడం) బయటకు వెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు తోకలపల్లి గ్రామ పెద్దలు నిర్ణయించారట.
అలాగే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ హౌసింగ్ సోసైటీ మహిళలు, మగాళ్లు లుంగీలు ధరించకూడదని తీర్మానం చేశారట. అయితే పురుషులు లుంగీలు కట్టుకుని తిరగడం వల్ల మహిళలకు ఇబ్బందిగా ఉందని, ఆడవాళ్లు నైటీలు వేసుకోవడం వల్ల మగాళ్లకు అసౌకర్యంగా ఉందని.. దీంతో నైటీలు, లుంగీలు నిషేధించారట. ఈ వార్త విన్న జనాలు పాపం నైటీలు వేసుకోకపోతే ఆడాళ్ల పరిస్థితి ఏంటి? ఇంట్లో పనులు సౌకర్యవంతంగా చేయలేరంటూ కామెంట్లు చేస్తున్నారు.