హెచ్ఐవి ఉందని తెలిసి కూడా 200 మందితో శృంగారంలో పాల్గొన్న మహిళ..

by Kavitha |
హెచ్ఐవి ఉందని తెలిసి కూడా 200 మందితో శృంగారంలో పాల్గొన్న మహిళ..
X

దిశ, ఫీచర్స్: అమెరికాలో ఓ సెక్స్‌ వర్కర్‌ తీరు వందల మందిని భయభ్రాంతులకు గురి చేసింది. తనకు హెచ్‌ఐవీ(HIV) పాజిటివ్‌ అని తెలిసినా కూడా అనేక మందితో లైంగిక సంబంధం పెట్టుకుంది.ఈ విషయం తెలిసిన అధికారులు సదరు స్థానికులను అప్రమత్తం చేశారు. ఆమెతో శృంగారంలో పాల్గొన్న వారు తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ హెల్త్‌ అలర్ట్‌ జారీ చేసి సదరు మహిళను అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలో వెలుగు చూసింది.

ఒహైయోలోని మరియెట్టాకు చెందిన లిండా లెచెసే ఓ సెక్స్‌ వర్కర్‌. అక్కడి మార్కెట్‌ వీధిలో అనేక మందిని ఆకర్షిస్తుండేది. ఇలా 2022 లో జనవరి నుంచి ఇప్పటివరకు 211 మందితో లైంగిక సంబంధం కొనసాగించింది. ఇదే సమయంలో ఆమె హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. అయినా సరే లిండా తన కార్యకలాపాలను కొనసాగించింది. తాజాగా ఈ విషయం గుర్తించిన అధికారులు ఆమె క్లయింట్లకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి.. మిగతా ఎవరైనా ఉంటే తమకు తెలియజేయాలని సూచిస్తున్నామని వాషింగ్టన్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయ అధికారులు, మెరియెట్టా పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed