Sravana Masam:శ్రావణ మాసంలో నాన్‌వెజ్ ఎందుకు తినరంటే ..దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

by Jakkula Mamatha |
Sravana Masam:శ్రావణ మాసంలో నాన్‌వెజ్ ఎందుకు తినరంటే ..దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రావణ మాసంలో చాలా మంది నిష్టగా లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. ఇక ఈ మాసంలో మహిళలు వ్రతం, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారనే విషయం తెలిసిందే. శ్రావణ మాసంలో సోమ, మంగళవారం, శుక్రవారం లకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ వారలలో చాలా మంది ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ మాసం కొత్తగా పెళ్లయిన వారికి ఎంతో పవిత్రమైనదిగా చెబుతుంటారు. శ్రావణ మాసంలో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయితే ఈ మాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ విషయానికై చాలా మందికి సందేహాలు ఉంటాయి. శ్రావణ మాసంలో నాన్వెజ్ ఎందుకు తీసుకోరు అని. దీనికి పలు సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం..

*సైంటిఫిక్ రీజన్స్ ఇవే..

*శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో కోళ్లు, ఇతర జంతువులకు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండటంతో శరీరంలో జీర్ణ వ్యవస్థ, రోగనిరోధక శక్తి మందగిస్తుంది. ఇలాంటప్పుడు మాంసం తినడంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.

*ఈ రోజుల్లో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉన్నందున శ్రావణంలో ఎక్కువగా సాధారణ ఆహారాన్ని తినమని వైద్యులు సూచిస్తారు.

*వర్షాకాలంలో గాలి, నీరు, ఆహారంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఆహారంలో స్వల్ప భాగం కూడా ఫుడ్ పాయిజనింగ్ మరియు డయేరియాకు కారణం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

*నాన్ వెజ్‌ను ధృడమైన ఆహారంగా పరిగణిస్తారు, ఇది సులభంగా జీర్ణం కాదు. ఇది ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. ఎసిడిటీ, కడుపులో తీవ్రమైన నొప్పి, వాంతులు-విరేచనాలు మొదలైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

*ఆయుర్వేదం ప్రకారం శ్రావణంలో మద్యం మరియు మాంసాన్ని వదిలివేయాలి. దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటంటే ఈ నెల మొత్తంలో తరచుగా వచ్చే వాతావరణ మార్పుల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడటంతో అనేక వ్యాధులు వస్తాయని ఆయుర్వేద వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed