- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మాయిల అండర్‌వేర్‌పై మరకలు.. ఆ ప్లేస్‌లోనే ఎందుకు పడుతాయో తెలుసా..?
దిశ, ఫీచర్స్: కొందరు లేడీస్ తమ ప్యాంటీపై బ్లీచింగ్ ప్యాచ్‌లు లేదా మరకలను గుర్తించే ఉంటారు. భయాందోళనకు గురయ్యే ఉంటారు. కానీ వేజినల్ డిశ్చార్జ్ ప్యాంటీల కలర్ చేంజ్‌కు కారణమవుతుందని, ఇది హెల్తీ సైన్ అని చెప్తున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన యోని సహజ pH విలువ 3.8 - 4.5 మధ్య ఉంటుంది. అంటే ఇది ఆమ్లం కాగా శుభ్రపరిచాక ఆరెంజ్ కలర్‌గా మారిపోతుంది. సాధారణంగా లైట్ కలర్స్ కాకుండా డార్క్ కలర్ ప్యాంటీస్ వాడితే ఈ విషయం గురించి ఎక్కువ తెలుస్తుంది.
ముందుగా చెప్పినట్లుగా ఆరోగ్యకరమైన యోని ఎసిడిక్ అయి ఉంటుంది. డిశ్చార్జ్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. హార్మోన్స్, పీరియడ్స్, లైంగిక జీవితంతో సహా అనేక కారణాల వల్ల ఈ pH స్థాయిలు మారవచ్చు. యోనిలో ఉండే లాక్టోబాసిల్లి అనే గుడ్ బ్యాక్టీరియా.. ఈ పీహెచ్ స్థాయిలను నిర్వహించడం ద్వారా, చెడు బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్ కలిగించకుండా నిరోధిస్తుంది. యోనిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే అండోత్సర్గము, గర్భధారణ సమయంలో డిశ్చార్జ్ పెరుగుతుంది. ఇది గాలికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు.. ఆక్సీకరణ కారణంగా లోదుస్తులపై పసుపు, నారింజ మరకలు ఏర్పడతాయి. యోనిని శుభ్రపరిచే ప్రక్రియలో భాగంగా రోజుకు 4ml డిశ్చార్జ్ జరుగుతుంది. ఇది ఆరోగ్యకరం. కానీ అంతకంటే ఎక్కువ అయినట్లు అనిపిస్తే గైనకాలజిస్టును సంప్రదించాలని సూచిస్తున్నారు నిపుణులు.
Also Read..