నాగుల చవితి రోజున పుట్టలో పాలు, గుడ్లు ఎందుకు పెడతారంటే.. సైంటిఫిక్ రీజన్ తెలిస్తే షాక్ అవుతారు..

by Kavitha |   ( Updated:2024-03-07 06:30:45.0  )
నాగుల చవితి రోజున పుట్టలో పాలు, గుడ్లు ఎందుకు పెడతారంటే.. సైంటిఫిక్ రీజన్ తెలిస్తే షాక్ అవుతారు..
X

దిశ, ఫీచర్స్ : తెలుగు వారు జంతువులను పూజించడం భారత సనాతన సంప్రదాయంగా వస్తున్న ఆచారం. ఎందుకంటేసమస్త జీవకోటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని నమ్ముతారు. అంతేకాకుండా మానవుడి మనుగడ ఆరంభమైనప్పుడు నుంచి జంతువులతో కలిసి జీవిస్తున్నాడు. ప్రకృతిని ఆరాధిస్తున్నాడు. అందులో భాగంగానే సర్పాలను కూడా పూజిస్తున్నాం. అందుకే తెలుగు వారు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో నాగుల చవితి ఆకటి. దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్ధినాడు నాగుల చవితి పండుగ నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఇక వేదాల్లో నాగ పూజ కనిపించకున్న.. సంహితాల్లో, బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. కనుక హిందువులు, జైనులు, బౌద్ధులు ఈ సర్పాలను నాగదేవతగా పూజిస్తారు.

ఇక ఈ పండుగ రోజున ఊరిలోని దేవాలయాల్లో ఉన్న పాము పుట్టల్లో లేదా ఊరి బయట ఉన్న పుట్టల్లో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయడమనేది అనాదిగా వస్తున్న ఆచారం. కానీ దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఏంటి అంటే.

మగ పాములు అమావాస్య తర్వాత తమ శరీరం నుండి సువాసనను తెలియజేసే ఫెరోమోన్స్ అనే రసాయనాన్ని పర్యావరణంలోకి విడుదల చేస్తాయి. ఈ వాసన ఆడ పామును ఆకర్షిస్తుంది. దీంతో మగ పాములు ఎక్కడ ఉన్న ఆడ పాములు వాటి వద్దకు వచ్చి కలయిక చేస్తాయి. అలా జరగకుండా ఉండడం కోసం పుట్టలో గుడ్లు, పాలు పోస్తారు.. ఈ వాసన కారణంగా మగ పాము, ఆడ పాము కలవడం జరగదు.

మరి ఎందుకు ఇలా చేయడం అంటే ఈ మాసంలో పొలం పనులు చాలా ఉంటాయి. ప్రతి ఒకరు పంటవేస్తారు. మనకు తెలిసి పొలాల్లో పాములు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. అవి కుటి చనిపోయిన రైతులు చాలా మంది ఉన్నారు. అందుకే అలాంటి విష సర్మల నుంచి ప్రాణ హాని కలగకుండా ఉండేందుకు. వారి వద్దకు ఎలాంటి పాములు అక్కడకి రాకుండా ఉండేందుకు ఇలా పుట్ట మొత్తం గుడ్లు పాలతో నింపుతారు.

Read More..

మహాశివరాత్రి రోజు శివున్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి.. ఈ పూజా విధానం తెలుసుకోండి..

Advertisement

Next Story

Most Viewed