చిన్న వయస్సులో తెల్లజుట్టు.. అసలు కారణం అదేనా?

by Javid Pasha |
చిన్న వయస్సులో తెల్లజుట్టు.. అసలు కారణం అదేనా?
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఏజ్ బార్ అయిన వాళ్లకే జుట్టు తెల్లబడేది. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఈ సమస్య వెంటాడుతోంది. స్కూల్‌కు, కాలేజీలకు వెళ్లే వయస్సులోనే వైట్ హెయిర్‌తో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. కవర్ చేయడానికి రకరకాల హెయిర్ కలర్లను వాడుతున్నారు. అయితే జుట్టు తెల్లబడటానికి అసలు కారణమేంటి?, ఎలా నివారించాలి అనే అంశంపై నిపుణుల సూచనలేమిటో చూద్దాం.

* ఈరోజుల్లో చాలామందికి వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో వ్యవస్థాగత, వ్యక్తిగత, శారీరక, మానసిక కారణాలు, ప్రభావాలు కూడా ఉండవచ్చు. విషయం ఏంటంటే.. శరీరంలో కొన్ని రకాల పోషకాలు లోపించడంవల్ల జుట్టు తెల్లబడుతుంది. ముఖ్యంగా విటమిన్ డి3, విటమిన్ బి12 లోపించడంవల్ల త్వరగా జుట్టు తెల్లబడవచ్చు. కాబట్టి మీకు జుట్టు తెల్లబడటం ప్రాంరభ దశలో ఉంటే ఈ పోషకాల లోపాలు ఉన్నాయోమో తెలుసుకోవడానికి టెస్టులు చేయించుకోవడం జాగ్రత్త పడవచ్చు అంటున్నారు నిపుణులు.

* ఇప్పటి వరకు తెల్లజుట్టు సహజమైన పద్ధతిలో రివర్స్ అవడానికి ఎలాంటి పరిష్కారం, చికిత్సలు లేవు. కానీ ప్రారంభంలో అవి ఎందువల్ల తెల్లబడుతున్నాయి? అనేది తెలుసుకోగలిగితే కొంత నివారించే చాన్సెస్ ఉన్నాయంటున్నారు నిపుణులు. అది కూడా 30 ఏండ్లలోపు వయస్సులో హార్మోన్ల అసమతుల్యత, పోషకాల లోపాలవల్ల అయినప్పుడు వాటిని భర్తీ చేసే సప్లిమెంట్లు సజెష్ చేయడం ద్వారా జుట్టు తెల్లబడటం తాత్కాలికంగా కొంతకాలం ఆగిపోవచ్చు.

* కొందరిలో పోషకాల లోపాలు, ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల జుట్టు త్వరగా తెల్లబడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మద్యం, సిగరెట్, మత్తు పదార్థాలు వంటి వ్యసనాలు, జంక్ ఫుడ్స్ మాత్రమే ఎక్కువగా తీసుకోవడం రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయి, దానిని తిరిగి భర్తీ చేయకపోవడం వంటివి త్వరగా తెల్లజుట్టు రావడానికి కారణం అవుతుంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మార్పు చేసుకోవడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం కారణంగా జుట్టు తెల్లబడటం ఆలస్యం అవుతుంది. అలాగే కలుషిత వాతావరణం, పర్యావరణ ప్రభావాలు కూడా వైట్ హెయిర్ రావడానికి కారణం అవుతుంటాయి. కాబట్టి మీరున్న ప్రాంతం, వాతావరణ పరిస్థితిని బట్టి కూడా నిపుణుల సలహాలతో సమస్యకు పరిష్కారం వెతకాలి అంటున్నారు నిపుణులు.

* గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాల విషయంలో ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed