Whiskey : మందు బాబులకు అలర్ట్.. విస్కీలో ఎంత వాటర్ కలపాలో తెలుసా?

by Javid Pasha |
Whiskey : మందు బాబులకు అలర్ట్.. విస్కీలో ఎంత వాటర్ కలపాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : కొంతమందికి మద్యం అలవాటు ఉంటుంది. అయితే వివిధ బ్రాండ్స్ యూజ్ చేసేటప్పుడు ఏది ఎంత మోతాదులో వాడాలి?, డ్రింక్ చేసేటప్పుడు అందులో ఎంత వాటర్ మిక్స్ చేయాలనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. దీంతో మందు తాగే సమయంలో పొరపాట్లు చేస్తుంటారని వాటి తయారీ దారులు పేర్కొంటున్నారు. విస్కీ విషయానికే వస్తే కొందరు కూల్ డ్రింక్స్ మిక్స్ చేస్తే, మరి కొందరు షోడా కలిపేసి తాగుతుంటారు. ఇంకొందరు ఇవి రెండూ కాకుండా వాటర్ మాత్రమే కలిపి తాగుతుంటారు.

వాస్తవానికి ఒక పెగ్ విస్కీలో ఎంత శాతం వాటర్ కలపాలనే విషయం తెలియక మందు బాబులు పొరపాట్లు చేస్తుంటారని ఇటీవలి సర్వేలో వెల్లడైంది. ఒక పెగ్‌లో 30 లేదా 60 మిల్లీ లీటర్ల విస్కీని తీసుకుంటే.. 30 మి.లీ. పెగ్ విస్కీలో 5 నుంచి 30 మి.లీ. నీరు కలపాలని, అప్పటికీ ఘాటు తగ్గకుంటే ఇంకా నీరు కలపవచ్చునని నిపుణులు చెప్తున్నారు. ఇక వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం.. 60 మిల్లీ లీటర్ల విస్కీలో 20 శాతం వరకు నీటిని కలపాలి. అంతకంటే ఎక్కువ కలపకూడదు. స్టడీలో భాగంగా వీరు బోర్బన్, రై, సింగిల్ -మాల్ట్, బ్లెండెడ్ స్కాచ్‌లు, ఐరిష్ విస్కీలతో సహా వివిధ బ్రాండ్లలో ప్రజలు వాటర్ మిక్స్ చేసే విధానాన్ని పరిశీలించారు. మొత్తానికి 80 విస్కీలో 20 శాతం నీరు కలపడాన్ని నిపుణులు బెస్ట్ మిక్స్ రేషియోగా పేర్కొంటున్నారు. అంతకంటే ఎక్కువ కలిపితే టేస్ట్ కోల్పోవచ్చునని చెప్తున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed