మగాడికి మొలతాడుకి సంబంధం ఏంటి..?

by sudharani |   ( Updated:2023-01-22 15:48:33.0  )
మగాడికి మొలతాడుకి సంబంధం ఏంటి..?
X

దిశ, వెబ్‌డెస్క్: మొలతాడు లేకుంటే మగాడే కాదు.. అని తెలుగులో ఒక ప్రసిద్ధ సామెత ఉంది. అసలు మగతనానికి మొలతాడుకి సంబంధం ఏంటి? మొలతాడు ఎందుకు కట్టుకుంటారు? కట్టుకోకపోతే ఏం అవుతుంది అనే చిత్రమైన సందేహంతో మీరు సతమతమవుతున్నారా..? అయితే మొలతాడు ఎందుకు కట్టుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మొలతాడు అనేది నడుము కింది భాగంలో కట్టుకునే ఒక తాడు. ముఖ్యంగా హిందూ ధర్మాన్ని ఆచరించే మగవారు నలుపు లేదా ఎరుపు రంగు మొలతాడు కట్టుకుంటారు. ఈ సంప్రధాయం ప్రధానంగా దక్షిణ భారత దేశంలో కనిపిస్తుంది. ఉత్తర భారతదేశం మగవారు కూడా చాలా వరకు ఈ ఆచారాన్ని పాటిస్తారు. సాధారణంగా చెడు దృష్టి పడకుండా.. దుష్ట శక్తుల నుంచి రక్షణగా మొలతాడు ఉంటుందని చెబుతారు. వేదాల ప్రకారం స్నానం చేసేటప్పుడు నగ్నంగా ఉండకూడదు. కనీసం చిన్న గుడ్డైనా ఉండాలి. మొలతాడు పవిత్రమైనది కాబట్టి అది ఒంటి మీద ఉంటే ఎలాంటి దోషాలు ఉండవనేది వేదం చెబుతుంది.

ఆరోగ్యపరంగా కూడా మొలతాడు ప్రాముఖ్యత కలిగింది. కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మొలతాడుని ధరించాలి అంటారు. మొలతాడు కడుపులోకి వెళ్లే ఆహారాన్ని నియంత్రణలో ఉంచుతుంది. తద్వార జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది బరువు పెరగడాన్ని కూడా తెలియబరుస్తుంది. బిగుతుగా ఉంటే కొవ్వు పెరిగినట్టు వదులుగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. నడుము ప్రాంతంలో నల్లటి దారం ఉంటే అది ఆ ప్రాంతంలో వేడిని గ్రహిస్తుంది. వృషణాలు అథిక వేడికి గురైతే మగవారిలో సుక్రకణాల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి వేడిని గ్రహించే నల్లటి మొలతాడు పరోక్షంగా మగవారిలో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతారు.

ఇవి కూడా చదవండి : SEX పొజిషన్స్ మార్చితే.. మహిళలకు ఎన్ని ఉపయోగాలో..!

మగవారిలో సంతానోత్పత్తిని పెంచడంలో మొలతాడు ప్రాధాన్యం

Advertisement

Next Story

Most Viewed