- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోషల్ మీడియాలో 'మస్కారా'.. ఇంత చెండాలంగా యూజ్ చేయబడుతుందా?
దిశ, ఫీచర్స్: మనం సాధారణంగా వాడే పదాలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మరో అర్థం ఉంటుంది. అంటే ఈ ప్లాట్‌ఫామ్స్‌లో కనెక్ట్ అయ్యే యూజర్స్‌కు కోడ్ లాంగ్వేజ్ అన్నమాట. తాజాగా ఈ కోడ్‌లోకి చేరింది 'మస్కారా'. ఐ మేకప్‌లో కంటిరెప్పలకు మెరుగులద్దే 'మస్కారా'.. టిక్‌టాక్‌లో దాని సొంత 'అల్గారిథమ్ స్పీక్'లో 'శృంగార భాగస్వామి'గా సూచించబడుతోంది. రొమాంటిక్ పార్ట్‌నర్ గురించి వివరించేందుకు #MascaraTrend అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించబడుతోంది. ఉదాహరణకు 'నేను నిజంగా ఇష్టపడిన ఒక మస్కారా నా వెంట్రుకలను చాలా ఘోరంగా దెబ్బతీసింది. కాబట్టి ఇప్పుడు ఏదైనా కొత్త మస్కారాను ప్రయత్నించాలంటే భయమేస్తుంది. ఎందుకంటే నా కనురెప్పలు మళ్లీ దెబ్బతినడాన్ని నేను భరించలేను' అంటూ రొమాంటిక్ ఫ్రెండ్‌తో బంధాన్ని మస్కారా రూపంలో వివరిస్తున్నారు.
ఇక మరికొంతమంది వినియోగదారులు లైంగిక వేధింపుల అనుభవాలను చర్చించడానికి #MascaraTrend ఉపయోగించడం ప్రారంభించారు. 'నాకు అప్పుడు 20 ఏళ్లు. గర్భవతిగా ఉన్నాను. కానీ వరుసగా మూడు గంటల పాటు మస్కారా ధరించాల్సి వచ్చింది. దీంతో ఇలాంటి బ్రాండ్‌లను చూసినప్పుడు ఫ్లాష్‌బ్యాక్ గుర్తొస్తుంది' అని ఒకరు చెప్పుకొచ్చారు. ఈ విధంగా #MascaraTrend ప్రస్తుతం 100 మిలియన్ల కంటే ఎక్కువ వీక్షణలను కలిగి ఉండగా.. ఇటీవల నటి జూలియా ఫాక్స్ చేసిన ఆన్‌లైన్ పొరపాటు కారణంగా మరింత ట్రెండ్ అయింది.
ఓ వ్యక్తి 'నేను ఒక అమ్మాయికి మస్కారా ఇచ్చాను. అది చాలా బాగుందని ఆమెతో పాటు ఆమె స్నేహితురాలు కూడా నా సమ్మతి లేకుండా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు' అని వివరిస్తూ వీడియోను పంచుకున్నాడు. దీనిపై స్పందించిన జూలియా ఫాక్స్ అతను సాధారణ మస్కారా గురించి చెప్పాడు అనుకుని.. 'కానీ నేను మీ గురించి బాధపడట్లేదు' అని రాసింది. దీంతో 'నేను లైంగికంగా వేధించబడ్డానని మీరు బాధపడటం లేదా?' అని అతను అడగ్గా.. ఇది సెక్సువల్ అసాల్ట్‌కు సంబంధించిన కోడ్ అని తెలియక అలా మాట్లాడానని క్షమాపణలు కోరింది.