- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Weight Loss Tips : అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా?.. ఈ మార్పులతో ప్రాబ్లం క్లియర్!
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా బయటి ఆహారాలు తినడం, మద్యపానం, ధూమపానం, ఆయిలీ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వంటివి ఈ సమస్యకు కారణం అవుతుంటాయి.అలాగే కొందరిలో జన్యుపరమైన కారణాలు కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా అధిక బరువు లేదా ఊబకాయం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులు దాడిచేస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. నివారించదగ్గ వాటిలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.
* బరువు తగ్గాలనుకునే వారు ప్రధానంగా తమ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. డైలీ వ్యాయామాలు చేయాలి. చాలామంది ఫ్రిజ్‌లో రకరకాల జంక్ ఫుడ్స్, స్నాక్స్ నిల్వ పెడుతుంటారు. ఖాళీగా ఉన్నప్పుడు వాటిని తింటుంటారు. ఇది అధిక బరువు పెరగడానికి కారణం అవుతుంది. తగ్గాలనుకుంటే వాటిని అవైడ్ చేయాలి. ప్యాక్ చేసినవి, ప్రాసెసింగ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ వంటివి కొనడం, ఫ్రిజ్‌లో పెట్టడం వంటివి చేయకూడదు. బదులుగా తాజా పండ్లు, కూరగాయలు మాత్రమే మీ కిచెన్‌లో ఉంచండి. ఫ్రిజ్ ఓపెన్ చేయగానే మీకు హెల్తీ ఫుడ్ మాత్రమే లభిస్తుంది. మీలోని అధిక బరువు సమస్య నివారణలో ఈ అలవాటు కీలకపాత్ర పోషిస్తుంది.
* టేస్టీగా ఉంటుందనో, అలవాటు ప్రకారమో వంటకాల్లో నూనె ఎక్కువగా వాడుతుంటారు. బరువు తగ్గాలంటే మాత్రం ఇది మార్చుకోవాలి. ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేయండి. ఉప్పు, కారం, చక్కెర వంటివి కూడా పరిమితంగానే ఉపయోగించాలి. ఫైబర్ ఫుడ్స్, కూరగాయలు, చేపలు, మాంసం వంటివి ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. కొందరు టీవీ చూస్తూనో, ఫోన్ చూస్తూనో రాత్రిళ్లు ఎక్కువగా తినేస్తుంటారు. కాబట్టి ఇలాంటి అవకాశం ఉన్నవారు చిన్న ప్లేట్లను వాడాలంటున్నారు నిపుణులు.
* కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, మైదా పిండితో చేసిన స్వీట్లు వంటివి రాత్రిళ్లు తినే అవాటు అధిక పెరువును మరింత పెంచుతుంది. కాబట్టి వీటిని అవైడ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటిలో ఎక్కువ కేలరీలు కలిగిన ఆహార పదార్థాలను ఉంచుకోకండి. ఎప్పుడైనా రుచికరమైన పదార్థాలు తినాలనిపిస్తే బయటి నుంచి తెచ్చినవి కాకుండా, ఇంటిలోనే తయారు చేసుకొని తినండి. మీరు కిచెన్‌లో ఈ విధమైన మార్పులు చేసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే అధిక బరువును కూడా తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు.